కరీంనగర్/ధనాధన్ న్యూస్: నగర ప్రజల రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో కరీంనగర్ నుంచి చింతకుంట, కొత్తపెళ్లి హవేలీ, వాగేశ్వరి కాలనీలకు నూతన సిటీ బస్ సర్వీసులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డా. మేడిపల్లి సత్యం, మానకొండూర్ ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, కరీంనగర్ మేయర్ కోలగాని శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నగర ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. నగర విస్తరణకు అనుగుణంగా ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని కొత్త బస్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నాగిరెడ్డి, జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ కుమార్ దేశాయ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, ఆర్టీఏ సభ్యుడు పడాల రాహుల్ గౌడ్, ఏఎంసీ చైర్మన్ ఆకుల నరసయ్య, సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, కాంగ్రెస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply