సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్!

హైదరాబాద్,జులై 03(ధనాధన్ న్యూస్):తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాష్ట్రంలోని నిరు ద్యోగులకు శుభవార్త అందించింది. తెలంగాణ రాష్ట్ర సీడ్ & ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీలో సీడ్ సర్టిఫికేషన్ ఆఫీసర్, రాష్ట్ర స్థాయి పోస్టు  ల భర్తీకి సరికొత్త జనరల్ రిక్రూట్‌ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా మొత్తం 19 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థు లకు నెలకు రూ. 51,320 నుండి రూ. 1,27,310 వరకు వేతనం ఉంటుంది. […]

అప్పు చేసి కడుతున్న బ్రో..!

సిద్ధిపేట, జులై 3(ధనాధన్ న్యూస్): ఇల్లు కట్టడం అంటే ఇటుకలు, సిమెంట్‌తో పాటు అప్పులూ ఉంటాయనే విషయాన్ని ఓ వ్యక్తి వినూత్నంగా, హాస్యభరితంగా చెప్పేశాడు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో కొత్త ఇంటి నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి, ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఫొటోతో ప్రత్యేక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఫ్లెక్సీలో బ్రహ్మానందం హావభావాలతో పాటు పెద్ద అక్షరాల్లో “అప్పు చేసి కడుతున్న బ్రో…” అని రాయించడంతో అటుగా వెళ్లేవారు ఆగి చదివి […]

పీఏసీఎస్‌లో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

జయశంకర్ భూపాలపల్లి,జులై 2 (ధనాధన్ న్యూస్): కాటారం మండలంలోని గారేపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)ను జిల్లా కలెక్టర్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎరువులు అందేలా జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఫెర్టిలైజర్ యాప్ ద్వారా జరుగుతున్న యూరియా విక్రయాల ప్రక్రియను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. ఈ-పోస్ యంత్రాల ద్వారా జారీ చేస్తున్న బిల్లులు, రైతుల బుకింగ్ వివరాలు, స్టాక్ రిజిస్టర్లు, ఎరువుల నిల్వల […]

తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..

హైదరాబాద్, జులై 2 (ధనాధన్ న్యూస్): రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య రాజకీయ వాగ్వాదం బుధవారం ఉద్రిక్తతకు దారితీసింది. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఇరు పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు విసురుతున్న నేపథ్యంలో గన్‌పార్క్ కేంద్రంగా రాజకీయ వేడి నెలకొంది.కాంగ్రెస్ తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో పాటు మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ గన్‌పార్క్‌కు చేరుకుని చర్చకు సిద్ధమయ్యారు. […]

ఎస్ఐఆర్‌పై ప్రజలకు అవగాహన అవసరం

కాటారం,జులై 2 (ధనాధన్ న్యూస్): భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంపై ప్రజలకు పూర్తి అవగాహన అవసరమని బీఆర్ఎస్ మండల నాయకుడు, ఇబ్రహీంపల్లి మొదటి వార్డు సభ్యుడు మంతెన చిరంజీవి అన్నారు.కాటారం మండలంలోని ఇబ్రహీంపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ఇంటింటి అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఓటరు తమ పేర్లు, వ్యక్తిగత వివరాలను ఓటరు జాబితాలో […]

ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజేందర్‌కు ఘన సన్మానం

జమ్మికుంట,జూలై 1 (ధనాధన్ న్యూస్): కరీంనగర్ జిల్లా ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఆకుల రాజేందర్‌ను జమ్మికుంట మండల మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం నాయకులు బుధవారం ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. శాలువాతో సత్కరించి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మున్నూరు కాపు జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి ఎబూషి శ్రీనివాస్ మాట్లాడుతూ, ఆకుల రాజేందర్ సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే నాయకుడని అన్నారు. బీసీ వర్గాల సమస్యలను నిరంతరం ప్రభుత్వ దృష్టికి […]

ప్రభుత్వ భూమిలో నిర్మాణం..అధికారుల మౌనం..!

కాటారం,జూన్ 30(ధనాధన్ న్యూస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఇబ్రహీంపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 257లో ప్రభుత్వ భూమిగా పేర్కొంటున్న స్థలంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ భూమి అని తెలిసినా కొందరు వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా ఇంటి నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారని వారు అంటున్నారు. ప్రభుత్వ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉన్నప్పటికీ, ఫిర్యాదులు వచ్చినా స్పందించడం […]

SIR ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలి: ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్

మెట్‌పల్లి,జూన్ 30(ధనాధన్ న్యూస్: మెట్‌పల్లి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన SIR (Special Intensive Revision) ప్రక్రియపై అవగాహన సదస్సుల్లో కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ పాల్గొన్నారు. సత్తక్కపల్లి, రాజేశ్వరరావుపేట, చెర్లకొండాపూర్, జగ్గాసాగర్, ఆత్మనగర్, రామలచక్కపేట గ్రామాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, SIR ప్రక్రియలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పాల్గొని అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా కృషి చేయాలని సూచించారు. బూత్ స్థాయి […]

కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఎక్కడ?

కమలాపూర్,జూన్ 30(ధనాధన్ న్యూస్): హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్ మండలంలో నిర్వహించిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించిన కల్యాణలక్ష్మి, గర్భిణీల సంక్షేమం కోసం కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, రైతులకు రైతుబంధు వంటి పథకాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం […]

ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌బీ డీఎస్పీ వెంకటరమణకు ఘన సన్మానం

జగిత్యాల,జూన్ 30(ధనాధన్ న్యూస్): జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఘన వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించి […]