
జగిత్యాల,జూన్ 30(ధనాధన్ న్యూస్): జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఘన వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించి శాఖకు మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. విధి నిర్వహణలో సమర్థత, బాధ్యతాయుతమైన వ్యవహారశైలి, సహోద్యోగులతో సత్సంబంధాలు ఆయన ప్రత్యేకతగా నిలిచాయని పేర్కొన్నారు.
ఉద్యోగ విరమణ అనేది ప్రభుత్వ సేవలకు మాత్రమే ముగింపు అని, సమాజ సేవకు కాదని ఎస్పీ అన్నారు. పదవీ విరమణ అనంతరం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో కలిసి సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
అనంతరం సహచర అధికారులు, పోలీసు సిబ్బంది వెంకటరమణతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సేవలను ప్రశంసించారు. పుష్పగుచ్ఛాలు అందించి, శాలువాతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించి ఘనంగా వీడ్కోలు పలికారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ చేతన్ నితిన్ (ఐపీఎస్), డీఎస్పీలు పురుషోత్తం రెడ్డి, రాములు, ఇన్‌స్పెక్టర్లు ఆరిఫ్ అలీ ఖాన్, సుధాకర్, కరుణాకర్, రవి, లక్ష్మీనారాయణ, వేణు, ఎస్‌ఐలు, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.