జగిత్యాల రైతు బజార్ వద్ద ట్రాఫిక్ సమస్యకు చెక్

జగిత్యాల,జూలై 13 (ధనాధన్ న్యూస్): జగిత్యాల పట్టణంలోని రైతు బజార్ ముందు రహదారిపై రైతులు కూరగాయలు విక్రయించడం వల్ల గత కొంతకాలంగా తీవ్ర ట్రాఫిక్ సమస్య నెలకొంది. ముఖ్యంగా విద్యానగర్ వైపు వెళ్లే ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో పాటు, సమీపంలోని ఆసుపత్రులకు వెళ్లే రోగులు, అంబులెన్స్‌లు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ సమస్యపై స్పందించిన ట్రాఫిక్ ఎస్‌ఐ మల్లేశం సోమవారం సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వార్డు కౌన్సిలర్ అరవ లక్ష్మి, మున్సిపల్ సిబ్బందితో […]

కేంద్రమంత్రి బండి సంజయ్ ముందస్తు జన్మదిన వేడుకలు

ఇల్లందకుంట,జూలై 10 (ధనాధన్ న్యూస్): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ 55వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ జెడ్పీహెచ్‌ఎస్ (ZPHS) పాఠశాలలో శుక్రవారం ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు, బండి సంజయ్ కుమార్ వీరాభిమాని మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా […]

ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం,పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు

శంకరపట్నం, జూలై 8 (ధనాధన్ న్యూస్): ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత  జన్మదిన వేడుకలు, ఎమ్మార్పీఎస్ ఉద్యమ సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని శంకరపట్నం మండలంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.మండల కేంద్రంలోని కేశవపట్నంలో ఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు కనుకుంట్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో, అంబేద్కర్ నగర్ గ్రామంలో మండల ప్రధాన కార్యదర్శి యామునూరి నాగరాజు ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దళిత […]

తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణికి కేటాయింపు

న్యూఢిల్లీ, జూలై 8 (ధనాధన్ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (ఎస్‌సీసీఎల్)కు కేటాయించాలంటూ పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు  చేసిన నిరంతర కృషి ఫలించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను ఎస్‌సీసీఎల్‌కు కేటాయించేందుకు ఆమోదం తెలిపింది.ఈ అంశంపై ఎంపీ వంశీకృష్ణ గడ్డం ఈ ఏడాది ఫిబ్రవరి 3న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కి అధికారికంగా లేఖ రాసి, తెలంగాణ […]

మందకృష్ణ మాదిగకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సతీష్ మాదిగ

హైదరాబాద్,జూలై 8 (ధనాధన్ న్యూస్): పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, దళిత ఉద్యమ నాయకుడు కు తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ జిల్లా ప్రచార కార్యదర్శి, మాజీ ఎమ్మార్పీఎస్ శంకరపట్నం మండల శాఖ అధ్యక్షుడు అంతడుపుల సతీష్ మాదిగ మంగళవారం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మందకృష్ణ మాదిగ నివాసానికి వెళ్లిన సతీష్ మాదిగ ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సతీష్ మాదిగ మాట్లాడుతూ, […]

యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల నల్లబ్యాడ్జీల నిరసన

జగిత్యాల, జూలై 7(ధనాధన్ న్యూస్): యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌లోని కోల్ హ్యాండ్లింగ్, యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ జగిత్యాలలో విద్యుత్ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ టీజీపీఈజేఏసీ (TGPEJAC) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాలలోని టీజీఎన్‌పీడీసీఎల్ (TGNPDCL) డివిజన్ కార్యాలయం ఆవరణలో ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో […]

కాటారం మండల కేంద్రంలో ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం

కాటారం,జూలై 7(ధనాధన్ న్యూస్): కాటారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మార్పీఎస్ కాటారం ఇంచార్జ్ బెల్లంపల్లి సురేష్ మాదిగ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ చేసి ఉద్యమ లక్ష్యాలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా బెల్లంపల్లి సురేష్ మాదిగ మాట్లాడుతూ, ఎమ్మార్పీఎస్ ఉద్యమం సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతూ నేటి తరానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. వికలాంగులు, వృద్ధులు, వితంతువుల సంక్షేమంతో పాటు గుండెజబ్బులతో బాధపడుతున్న చిన్నారులకు వైద్యసేవలు అందేలా ఉద్యమం చేసి […]

రూ.13 కోట్ల బీటీ రోడ్డు పనులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శంకుస్థాపన

హనుమకొండ, జూలై 6 (ధనాధన్ న్యూస్):ఎల్కతుర్తి మండలం భవిష్యత్తులో అభివృద్ధిలో మరింత ముందంజలో నిలుస్తుందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి జంక్షన్ వద్ద మడిపల్లి నుంచి ఎల్కతుర్తి జంక్షన్ వరకు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (KUDA) ఆధ్వర్యంలో రూ.13 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కొబ్బరికాయ కొట్టి శిలాఫలకాన్ని ఆవిష్కరించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా […]

గౌన్లవానీకుంట పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్): జమ్మికుంట నూతన తహసీల్దార్‌గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన గడ్డం సుధాకర్‌ను 5వ వార్డు కౌన్సిలర్ యాట్ల సునీత అశోక్ మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా 5వ వార్డులోని గౌన్లవానీకుంట ఆక్రమణలకు గురవుతోందని, వెంటనే రెవెన్యూ సర్వే నిర్వహించి కుంట హద్దులు నిర్ధారించి, చుట్టూ రక్షణ గోడ (బౌండరీ) ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని వార్డు ప్రజల తరఫున తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. వినతిపై స్పందించిన తహసీల్దార్ […]

బాస్ స్కీమ్ విద్యార్థుల ప్రవేశాలపై వివాదం..చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల వినతి

జమ్మికుంట,జూలై 3(ధనాధన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ హైస్కూల్‌లో బాస్ (BAS) స్కీమ్ కింద చదువుతున్న విద్యార్థులను పాఠశాలలో కొనసాగించకుండా యాజమాన్యం ఇబ్బందులకు గురిచేస్తోందని పలువురు తల్లిదండ్రులు మండల విద్యాధికారికి వినతిపత్రం సమర్పించారు. తల్లిదండ్రుల కథనం ప్రకారం, ఈ విద్యా సంవత్సరంలో బాస్ స్కీమ్‌కు సంబంధించిన నిధులు ప్రభుత్వం నుంచి అందలేదని పేర్కొంటూ, విద్యార్థులను కొనసాగించాలంటే ఫీజులు చెల్లించాలని పాఠశాల యాజమాన్యం ఒత్తిడి చేస్తోందని ఆరోపించారు. ఫీజులు చెల్లించకపోతే తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్పించుకోవాలని సూచిస్తున్నారని […]