హమాలి కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 23: రాష్ట్రంలోని అన్ని రంగాల హమాలి కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి టేకుమల్ల సమ్మయ్య, జిల్లా అధ్యక్షుడు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.మంగళవారం బొమ్మకల్ సిమెంట్ గోదాముల హమాలి కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర నాలుగో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని సిమెంట్ గోదాముల్లో పనిచేస్తున్న హమాలి కార్మికులకు పని భద్రత […]
జిల్లా కలెక్టరేట్‌కు ఆర్టీఐ నోటీసులు

బుగ్గారం,జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 24:జగిత్యాల జిల్లా కలెక్టరేట్‌కు తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ నుంచి నాలుగు ఆర్టీఐ కేసులకు సంబంధించి నోటీసులు జారీ అయినట్లు సీనియర్ ఆర్టీఐ కార్యకర్త, సామాజికవేత్త చుక్క గంగారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు.ఈ నెల 24వ తేదీ బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ ఎదుట విచారణకు హాజరుకావాలని జిల్లా కలెక్టరేట్ అధికారులను నోటీసుల్లో ఆదేశించినట్లు చెప్పారు. అయితే, ఈ నోటీసులను జిల్లా […]
ఎస్బీఐ లైఫ్ కార్యాలయంలో ఘనంగా ఫాదర్స్ డే వేడుకలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: ఫాదర్స్ డే సందర్భంగా హుజురాబాద్ పట్టణంలోని ఎస్బీఐ లైఫ్ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్‌లో పాలసీలు కలిగిన ఐదుగురు తండ్రులను లైఫ్ మిత్ర తవటం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంపిణీ చేసి ఫాదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. సమాజంలో, కుటుంబ వ్యవస్థలో తండ్రులకు ప్రత్యేక స్థానం ఉండటంతో పాటు కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంలో వారి పాత్ర కీలకమని ఎస్బీఐ […]
వర్షాలు కురవాలంటూ గ్రామదేవతలకు జలాభిషేకాలు

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్: ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతూ, వర్షాలు కురవాల్సిన సమయంలోనూ వర్షాల జాడ కనిపించకపోవడంతో హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామస్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.గ్రామంలో ఉన్న గ్రామదేవతలు, వనదేవతలు, హనుమంతుడు, భైరవాది గుట్టలోని కాలభైరవ స్వామికి జలాభిషేకాలు చేసి వర్షాలు కురవాలని వేడుకున్నారు. సంప్రదాయ ఆచారాల ప్రకారం బండపై వరద పాశం పోసి నాలుకతో అద్దడం, బతకమ్మ ఆటలు ఆడడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని, పశుపక్షాదులు, ప్రజలు చల్లగా […]
మానవత్వం చాటుకున్న రాయికల్ 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 21: కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ విద్యార్థులు తమ సహాధ్యాయి మాచర్ల నాగరాజుకు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు.రాయికల్ గ్రామానికి చెందిన మాచర్ల నాగరాజు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇదే సమయంలో ఆయన తండ్రి మాచర్ల కొమురయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ విషయం తెలుసుకున్న 2004-05 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ మిత్రులు […]
మత సామరస్యానికి ప్రతీకగా మొహరం ఉత్సవాలు

నంగునూరు/ధనాధన్ న్యూస్,జూన్ 20:సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం గట్ల మల్యాల గ్రామంలో మొహరం వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మతాలకు అతీతంగా, చిన్నా పెద్దా తేడా లేకుండా గ్రామ ప్రజలందరూ కలిసికట్టుగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు.ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ, గట్ల మల్యాల గ్రామంలో ప్రతి సంవత్సరం మొహరం వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. హిందూ, ముస్లిం సోదరులు కలిసి సామరస్య వాతావరణంలో ఉత్సవాలను జరుపుకోవడం గ్రామ ప్రత్యేకత అని తెలిపారు.మత సామరస్యానికి ప్రతీకగా […]
పిచ్చికుక్క దాడిలో గాయపడిన వారిని పరామర్శించిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 20: సారంగాపూర్ మండలం పోతారం గ్రామంలో శుక్రవారం రాత్రి పిచ్చికుక్క దాడిలో గాయపడిన బాధితులను జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. పిచ్చికుక్క దాడిలో మహిళలు సహా 11 మందికి పైగా గాయపడగా, వారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆస్పత్రికి వెళ్లిన ఎమ్మెల్యే బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాయపడిన […]
గ్రామ దేవతల ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఊర్లను కాపాడే అమ్మవార్లు ప్రజలకు ఇష్టమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ మహాలక్ష్మి,భూ లక్ష్మీ,నాభి శిల (బొడ్రాయి),పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగ్గయ్యపల్లి గ్రామంలో […]
అడవుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి:అటవీశాఖ అధికారులు

సైదాపూర్/ధనాధన్ న్యూస్,జూన్ 18 (ప్రతినిధి):వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్ గ్రామంలోని అటవీ భూమిలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ ఉన్నతాధికారులు అడవుల ఆవశ్యకత, మొక్కల పెంపకం ప్రాధాన్యత, వాటి సంరక్షణ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ పలు సూచనలు, సలహాలు అందించారు. అలాగే రాయికల్ అటవీ ప్రాంతంలో ఉన్న రాయికల్ జలపాతాన్ని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు పంపించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రాయికల్ […]
విద్యను వ్యాపారంగా మారుస్తున్న శ్రీ చైతన్య పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

కరీంనగర్/ధనాధన్ న్యూస్,జూన్ 18: కరీంనగర్ నగరంలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలల యజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల పేరుతో పుస్తకాలు అమ్ముతూ విద్యను వ్యాపారంగా మారుస్తున్నారని శ్రీ చైతన్య పాఠశాలలో విజ్ఞాన కేంద్రాలుగా కాకుండా వ్యాపార కేంద్రాలుగా మారాయని శ్రీ చైతన్య పాఠశాలలు నిబంధనలు పాటించకపోతే ఆ పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భౌతిక దాడులు చేస్తామని ఒక్క రూపాయి ఎక్కువ ఫీజులు వసూలు చేసిన ఊరుకునేది లేదని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మచ్చ రమేష్ హెచ్చరించారు. గురువారం […]
