ఆర్టీవో నూతన భవన నిర్మాణానికి కృషి

By dhanadhannews.com

  • రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ హామీ

హుజురాబాద్, సెప్టెంబర్ 03 (ధనాధన్ న్యూస్):
హుజురాబాద్ ఆర్టీవో కార్యాలయానికి కొత్త భవనం నిర్మాణం కోసం కృషి చేస్తానని రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ మెంబర్ పడాల రాహుల్ అన్నారు.

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసి క్యాంప్‌లో గల ఆర్టీవో కార్యాలయాన్ని ఆయన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా హుజురాబాద్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు.

కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం పడాల రాహుల్ మాట్లాడుతూ, హుజురాబాద్ డివిజన్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త ఆర్టీవో భవన నిర్మాణం అవసరమని, ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లి, వీలైనంత త్వరగా భూమి కేటాయింపు చేసి నిర్మాణం ప్రారంభించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హుజురాబాద్ యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు చల్లూరు రాహుల్, అర్జున్, గౌతమ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డితో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.