సాంస్కృతిక శాఖ మండల కమిటీ ఎన్నిక

By dhanadhannews.com

  • జమ్మికుంట మండల ఉపాధ్యక్షులుగా రంగు లింగయ్య,మొలుగూరి సుమలత, ప్రధానకార్యదర్శిగా కొలుగూరి రజిత
కొలుగూరి రజిత.ప్రధాన కార్యదర్శి

జమ్మికుంట,ధనాధన్ న్యూస్:

కళలను ప్రోత్సహించడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కళలను వెలికితీస్తూ కళాకారులుగా తయారు చేయడమే సాంస్కృతిక సంస్థల ముఖ్య ఉద్దేశమని జమ్మికుంట సాంస్కృతిక సమాఖ్య సంస్థ మండల అధ్యక్షుడు వేముల అశోక్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వైఎస్ శర్మ ఆదేశాల మేరకు,హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తాండ్ర శంకర్ సూచనలతో జమ్మికుంట మండల కమిటీని సోమవారం ఎన్నుకున్నారు.ఉపాద్యక్ష, ప్రధాన కార్యదర్శి గా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామానికి చెందిన మొలుగూరి సుమలత,కొలుగూరి రజిత ను ఎన్నుకున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

మోలుగూరి సుమలత (ఉపాధ్యక్షురాలు)

నూతనంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ సాంస్కృతిక సంస్థల నిర్ణయాలకు అనుగుణంగా పనిచేస్తామని గ్రామాల్లో కలలను ప్రోత్సహించి, రాబోయే రోజుల్లో గ్రామ కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తాండ్ర శంకర్,కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు బోళ్ల కొమురయ్య,అందాస్ నారాయణ,జమ్మికుంట మండల ఉపాధ్యక్షుడు రంగు లింగయ్య,కనపర్తి ప్రభాకర్ రావు,గడ్డం నారాయణ తదితరులు పాల్గొన్నారు.