మృగశిర కార్తె సందర్భంగా ఉచిత ఆయుర్వేద మందు పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో ఉన్న శ్రీ సూర్య భగవాన్ ధన్వంతరి ఆలయంలో మృగశిర కార్తె సందర్భంగా భక్తులకు మృగశిర ఆయుర్వేద ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మృగశిర కార్తె రోజున ఈ ఔషధాన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఈసినోఫిలియా తదితర అలర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ ఆయుర్వేద ఔషధాన్ని భక్తులకు ఉచితంగా అందిస్తున్నట్లు పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో ధన్వంతరి ఆలయ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన్న, ఆలయ అధ్యక్షుడు వొడ్నాల శ్రీనివాస్‌తో పాటు ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment