జమ్మికుంట పట్టణంలోని ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది.ఈ క్యాంపులో 140 మంది రోగులు వారికి ఉన్న అనారోగ్య సమస్యలను చూపించుకున్నారు.వీరికి ఉచిత రక్త పరీక్షలు-మూత్ర పరీక్షలు మరియు గుండె పరీక్ష (ఈసీజీ) చేసి సీనియర్ డాక్టర్లు ఆకుల శ్రీనివాస్(జనరల్ ఫిజీషియన్),కార్తీక్ రెడ్డి (సర్జన్) లచే పేషెంట్లకు ఉన్న రోగ నిరోధకతను గుర్తించి వారికి సలహాలు మరియు సూచనలు చెప్పి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డైరెక్టర్ ఎల్కే దేవేందర్ రెడ్డి,సిబ్బంది మరియు పిఆర్వోలు పాల్గొని ఈ మెగా క్యాంపును విజయవంతం చేశారు.
