గడ్డం సమ్మయ్య కి దళిత రత్న అవార్డు

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతి వేదికగా దళిత రత్న అవార్డు ప్రధానోత్సవం ఘనంగా నిర్వహించబడింది.మహనీయులు బాబు జగజీవన్ రామ్ మరియు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఉత్సవ కమిటీ వైస్ చైర్మన్ బైరి వెంకటేశం ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి.


ఎస్సీ 52 కులాల సంఘం అధ్యక్షుడు రైళ్ల లక్ష్మీ నరసయ్య కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హుజురాబాద్ ఇందిరానగర్‌కు చెందిన గడ్డం సమ్మయ్యకు దళిత రత్న అవార్డు ప్రదానం చేశారు.ఆయన ఎస్సీ 57 ఉపకులాల రాష్ట్ర కార్యదర్శిగా సేవలు అందిస్తున్నందుకు గుర్తింపు లభించింది.
సమాజ సేవలో చేసిన కృషిని ప్రముఖులు ప్రశంసించారు.
కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment