ఆర్థిక సాయం అందజేసిన గల్ఫ్ సేవా సమితి


బుగ్గారం / జగిత్యాల జిల్లా, ( చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ): జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని గల్ఫ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇటీవల గుండెపోటుతో గల్ఫ్‌లో కన్నుమూసిన సాటి గల్ఫ్ కార్మికుడు పులి మహేష్  కుటుంబానికి సోమవారం రూ. 72,100 (డెబ్బై రెండు వేల వంద రూపాయలు) ఆర్థిక సాయం అందజేశారు. వారి వంతు సహాయంగా గల్ఫ్ కార్మికులందరం కలిసి తల కొంత డబ్బు సేకరించి మృతుడి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయంగా అందించారు.అమరుడైన మహేష్ లేని లోటు ఎప్పటికీ తీరనిదని అన్నారు. మహేష్ మంచి తనం గూర్చి గుర్తు చేసుకున్నారు. మృతుడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మేము అందించిన ఈ చిన్న సహాయం వారి బాధను తీర్చలేకపోయినా, కష్టకాలంలో వారు ఒంటరిగా లేరనే భరోసాను అందిస్తుందని విశ్వసిస్తున్నామని పేర్కొన్నారు.  భగవంతుడు మహేష్ ఆత్మకు శాంతిని ప్రసాదించి, వారి కుటుంబ సభ్యులకు ఈ తీరని విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా వారంతా కోరుకున్నారు.ఈ సేవాకార్యంలో భాగస్వాములై తమ వంతు సహాయాన్ని అందించిన ప్రతి ఒక్క గల్ఫ్ సేవా సమితి – బుగ్గారం సభ్యులకు కార్యవర్గం, గ్రామ ప్రముఖులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Leave a comment