వాసవి వనిత క్లబ్ ఆధ్వర్యంలో అధ్యక్షురాలు మురికి పూర్ణిమ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలలో డాక్టర్ హేమలత, వావిలాల కొత్తూరు జయశ్రీ,వికారాబాద్ ప్రవచన రత్న బిరుదాంకితురాలు,గీతా ప్రచారకురాలు విశ్వహిందూ పరిషత్ జిల్లా మాతృ శక్తి సంయోజక భాగ్యలక్ష్మి, ఫార్మర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఆదర్శ రైతు అవార్డు గ్రహీత చాలా స్వరూప,కొత్తపల్లి డాక్టర్ వాణి, పెళ్లి అరుణాదేవి,వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ డాక్టర్ జంధ్యం మాధవి,ఆదర్శ రైతు ఆస్కార్ అవార్డు గ్రహీత,వాసవి వనిత క్లబ్ సెక్రటరీ యాంసాని భాగ్యలక్ష్మి,ట్రెజరర్ మాడిశెట్టి రేవతి,గర్రెపల్లి అరుణాదేవి పాల్గొన్నారు.ఈ సందర్భంగా వాసవి వనిత క్లబ్ సభ్యులు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో రాణించాలని పిలుపునిచ్చారు.
