నడికూడ,ధనాధన్ న్యూస్ : నాపై నమ్మకం,విశ్వాసం ఉంచి నడికుడ మండల బీజేవైఎం అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పగడాల కాళీ ప్రసాద్,రావు పద్మ, హనుమకొండ జిల్లా బీజేవైఎం అధ్యక్షులు,నా ఆత్మీయ మిత్రుడు పున్నం వేణు, హనుమకొండ జిల్లా బీజేపీ అధ్యక్షులు కోలాను సంతోష్ రెడ్డి,నడికూడ మండల బీజేపీ అధ్యక్షులు ఎరుకల దివాకర్ లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు,భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు,ఆశయాలు, దేశభక్తి స్ఫూర్తితో యువతను ఏకం చేస్తూ,కార్యకర్తలతో కలిసి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని మండలంలోని ప్రతి గ్రామంలో యువతకు అండగా నిలుస్తూ,ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ,ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుతానని నడికూడ మండల యువత గొంతుకగా,కార్యకర్తల సహచరుడిగా,ప్రజల సేవకుడిగా నిరంతరం మీ మధ్య ఉంటూ పనిచేస్తానని బీజేవైఎం నడికూడ మండల అధ్యక్షులు తాళ్లపెల్లి హరి కృష్ణ గౌడ్ తెలిపారు.

Leave a Reply