జమ్మికుంట/ధనాధన్ న్యూస్: జమ్మికుంట మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులుగా మడికొండ సురేందర్ రావు గారినిఎన్నుకోవడం జరిగినది వీరికి మద్దతుగా 11 మంది సర్పంచులు మద్దతు తెలిపారు.ఈ ఎన్నికలో గండ్రపల్లె సర్పంచ్ తోట కవిత- లక్ష్మణ్,బిజిగిరి షరీఫ్ సర్పంచ్ రాచపల్లి వనజ- రాజయ్య,వెంకటేశ్వర్ల పల్లె సర్పంచ్ పోల్సాని వినోద-నారాయణరావు, శంభుని పల్లె సర్పంచ్ రాసపల్లి కోమల-సదానందం, అంకుశాపురం సర్పంచ్ కావడి కుమారస్వామి, సైదాబాద్ సర్పంచ్ పూప్పల రాజారాము,పెద్దంపల్లి సర్పంచ్ ఎగిత పద్మ-కుమార్ ,జగ్గయ్య పల్లె సర్పంచ్ గట్టు హేమలత- వీరన్న , నాగంపేట సర్పంచ్ కప్పల పోచయ్య , పాపక్కపల్లె సర్పంచ్ గజవేణి లక్ష్మి -ఐలయ్య లు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా
జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వరరావురావు , సింగిల్ విండో మాజీ చైర్మన్ పొనగంటి సంపత్, మాదిరెడ్డి వెంకటరెడ్డి,బల్మూరి సుబ్బారావు,తోట లక్ష్మణ్ మాజీ ఎంపీటీసీ రాజయ్య పలువురు నాయకులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మడికొండ సురేందర్ రావు మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క సర్పంచులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.రానున్న రోజులలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు.
