
జగిత్యాల, ధనాధన్ న్యూస్ : నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు, బీజేపీ నాయకుడు ధర్మపురి అరవింద్‌ను బీజేపీ ఎస్సీ మోర్చా జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నారపాక అశోక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో బీజేపీ ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేయడంతో పాటు, దళిత వర్గాలను పార్టీకి మరింత చేరువ చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు.ప్రత్యేకంగా బీర్పూర్ మండలంలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడం, గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, మండల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీ ధర్మపురి అరవింద్‌తో నారపాక అశోక్ చర్చించినట్లు తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల మధ్య పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని, పార్టీ బలోపేతానికి అవసరమైన సహకారం అందిస్తామని ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ ఇచ్చినట్లు నారపాక అశోక్ పేర్కొన్నారు.రానున్న రోజుల్లో జగిత్యాల జిల్లాలో ఎస్సీ మోర్చాను మరింత బలోపేతం చేస్తూ, దళిత వర్గాల సంక్షేమం, అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం లక్ష్యంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయంతో ముందుకు సాగుతామని నారపాక అశోక్ తెలిపారు.
