- కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా ప్రారంభం
జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జనవరి 07 :
మన వార్త దినపత్రిక నూతన సంవత్సరం 2026 క్యాలండర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జమ్మికుంటలో ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ,పత్రిక ప్రజలకు–అధికారులకు మధ్య వారధిగా పనిచేస్తుందని అన్నారు. సమాజానికి అవసరమైన వార్తలు, సమాచారాన్ని ఉన్నది ఉన్నట్లుగా ప్రజలకు చేరవేస్తూ, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ అనతికాలంలోనే విశేష ప్రాచుర్యం పొందిన మన వార్త దినపత్రిక యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు.ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి, ప్రభుత్వ అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తూ పరిష్కార దిశగా మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. రానున్న రోజుల్లో మన వార్త దినపత్రిక మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మన వార్త దినపత్రిక యాజమాన్యం, సీఈఓ & ఎడిటర్ భూపతి సంతోష్,డైరెక్టర్ యెబుషి సంపత్ తదితరులు పాల్గొన్నారు.
