జమ్మికుంటలో గణేష్ నవరాత్రుల ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పడాల రాహుల్

By dhanadhannews.com

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: హుజురాబాద్ నియోజకవర్గం, జమ్మికుంట పట్టణంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా యువసేన యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ కరీంనగర్ జిల్లా మెంబర్ పడాల రాహుల్ పాల్గొని పూజలు చేశారు.

ఈ సందర్భంగా పట్టణ ప్రజలతో మాట్లాడుతూ పడాల రాహుల్, సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వం పెంపొందేందుకు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. యువతతో కలిసి సామాజిక సేవా కార్యక్రమాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాయిని రవి, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు చల్లూరి రాహుల్, జిల్లా మరియు నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు.