
నడికూడ, ధనాధన్ న్యూస్ : నడికూడ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మహిళ సమైక్య భవనాన్ని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు.అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతాలను పరిశీలించారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ నడికూడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు మరింత చేరువవుతాయని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని,ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రైవేటు హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయని
ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా,మండల అధికారులు,డాక్టర్లు, సర్పంచులు,కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు,ఏఎన్ఎంలు,ఆశా కార్యకర్తలు,మహిళా సంఘాలు, తదితరులు పాల్గొన్నారు.
