- జమ్మికుంటలో భారీ ధర్నా
జమ్మికుంట/ధనాధన్ న్యూస్ అక్టోబర్ 10:
జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆవరణలో ఏఐఆర్ఆర్ఎఫ్, ఎన్సిసిపిఏ, ఫోరమ్ ఆఫ్ నేషనల్ పెన్షనర్స్ అసోసియేషన్, ఎఫ్ ఓ సి పి ఏ పిలుపుమేరకు జమ్మికుంట బ్రాంచి ఆధ్వర్యంలో భారీ ఎత్తున దర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రైల్వే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జమ్మికుంట బ్రాంచ్ అధ్యక్షులు, జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ దాసరి రాజేశ్వర్ మాట్లాడుతూ పెన్షనర్స్ యొక్క న్యాయమైన డిమాండ్లు అయినటువంటి పెన్షన్ వాలిడేషన్ బిల్లు 2025ను రద్దు చేయాలి,అందరికి పాత పెన్షన్ విదానాన్ని అమలు చేయాలి,8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేసి వెంటనే అమలు పరచాలి.కోవిడ్ సమయంలో నిలిపివేసిన 18 నెలల కరువు భత్యాన్ని వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో రాబోవు కాలంలో వంతుల వారిగా ఉద్యమాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఆర్ పి డబ్ల్యూ ఏ శాఖ కార్యదర్శి శీలం మల్లేశం మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్కు రైలు ప్రయాణంలో రాయితీలను పునరుద్దరించాలి.పెన్షనర్ల న్యామైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి.వెంకటస్వామి, వైస్ ప్రెసిడెంట్ యం.డి ఖాజామొయినొద్దీనన్, ట్రెజరర్ యం.డి ఖాదర్ ఖాన్, బి.సాంబయ్య, అసిస్టెంట్ సెక్రటరీ ఎస్.రాజయ్య, ఎస్ పోచయ్య, ఎన్సిసిపిఏ లో భాగస్వాములైన తాప్రా జమ్మికుంట శాఖ అధ్యక్షులు గరిగే చంద్రయ్య, శీలం సారభద్ర స్వామి నాతోపాటు 100 మంది పెన్షనర్స్, ఫ్యామిలీ పెన్షనర్స్ సభ్యులు పాల్గొన్నారు.
