అధికారుల వైఖరికి నిరసనగా అంబేద్కర్ కు వినతిపత్రం

By dhanadhannews.com

  • నిద్రమత్తులో విద్యాశాఖ ఉన్నతాధికారులు
  • హుజురాబాద్ ఎంఈఓ పై చర్యలు తీసుకోకపోవడానికి గల ఆంతర్యం ఏమిటి
  • ఎంఈఓ ను కార్యాలయ పనులు చేసిన ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలి
  • చర్యలు తీసుకోకపోతే ఎంఈఓ , గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడి అధికార దుర్వినియోగంపై పోస్టర్ ఆవిష్కరణ
  • ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్యకిరణ్


హుజురాబాద్/ధనాధన్ న్యూస్: విద్యాశాఖ అధికారుల తీరుకు నిరసనగా హుజరాబాద్ పట్టణంలో గల అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ తెలంగాణ రాష్ట్ర కన్వీనింగ్ కమిటీ మెంబర్ కొలుగూరి సూర్య కిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజూరాబాద్ మండల విద్యాధికారి పై విద్యాశాఖలో పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోకపోవడంలో గల ఆంతర్యం ఏమిటో తెలియడం లేదని హుజరాబాద్ మండలం లో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని హుజరాబాద్ మండల విద్యాధికారి మరియు స్కూల్ అసిస్టెంట్ గణితం బోధించవలసిన గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు కుమ్మక్కై కార్యాలయ విధుల పేరిట బోధ నేతల పనులు చేయడం కచ్చితంగా విద్యార్థులకు అన్యాయం చేసినట్లే అని అన్నారు.ఈ విషయమై జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో , విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు మరియు కమిషనర్ సంచాలకులు విద్యాశాఖ డైరెక్టర్ లకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విద్యార్థులకు పాఠాలు బోధించి జీతాలు పొందవలసిన ఉపాధ్యాయుడు ఎంఈఓ కార్యాలయంలో విధుల పేరిట టైంపాస్ చేశాడని గడిచిన రెండు సంవత్సరాలుగా ప్రభుత్వం నుండి లక్షల్లో జీతాలు పొందాడని పాఠాలు చెప్పకున్నా జీతాలు పొందడం ఎంతవరకు సమంజసం అని మండిపడ్డారు .తక్షణమే ప్రభుత్వం ఇట్టి విషయమై దృష్టిసారించి హుజరాబాద్ ఎంఈఓ ను మరియు గోపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు .లేనిపక్షంలో స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను మరియు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ,ఈ విషయమై దశల వారీగా  ఉద్యమం ఉదృతం చేస్తానని వీరి అధికార దుర్వినియోగంపై పోస్టర్ ఆవిష్కరణ చేస్తానని  తెలిపారు.