రంజాన్ ఏర్పాట్లకై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం

By dhanadhannews.com

ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానున్న 30 రోజుల పవిత్ర రంజాన్ మాసంను పురస్కరించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచించిన విధంగా రంజాన్ పండుగ ఏర్పాట్లు పకడ్బందిగా చేయాలని కోరుతూ నేడు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మైనార్టి డిపార్ట్మెంట్ చైర్మన్ మహ్మద్ తాజొద్దీన్ ఆధ్వర్యంలో పలువురు మైనారిటీ నేతలతో కలిసి కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.కరీంనగర్ పట్టణంతో పాటు జిల్లాలోని 4 మున్సిపాలిటిలు,16 మండలాల పరిధిలోని మజీద్ లకు శానిటేషన్,వాటర్,కరెంట్ సప్లై,రాత్రివేలల్లో తగిన పోలీస్ భద్రత కల్పించాలని మరియు ఈద్గాలు, ఖబ్రస్తాన్ లను శుభ్రం చేయించాలని జిల్లా కాంగ్రెస్ మైనార్టి సేల్ పక్షాన కోరారు.నగరంలో 30 రోజులు పండ్ల దుకాణాలకు,హోటలు,ఫుట్పాత్ మీద వ్యాపారం చేసుకునే విధంగా చిరు వ్యాపారులకు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా సహకరించాలని,నమాజ్ ప్రార్ధన సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని,రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు తరాబి నమాజ్ ప్రత్యేక నమాజ్ వెళ్లేవారికి అసాంఘిక శక్తుల నుండి ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగిన పోలీస్ భద్రత కల్పించాలని కలెక్టర్ ని కోరారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్,కాంగ్రెస్ నాయకులు లయీక్ ఖాద్రి,ఖాజా ఖాన్,జమీల్ అహ్మద్, మహమ్మద్ అమీర్,  తదితరులు పాల్గొన్నారు.