- పరకాల సిడిపిఓ స్వాతి

నడికుడ,ధనాధన్ న్యూస్: పోషణ మాస కార్యక్రమంలో భాగంగా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామంలోని ఒకటి,నాలుగు అంగన్వాడి సెంటర్ జిపి స్థాయిలో కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల సీడీపీఓ స్వాతి పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీలో అందించే సేవల గురించి,గర్భిణీల తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పిల్లల పోషకాహారం, ఆకుకూరల ప్రాముఖ్యత, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే అనారోగ్యాలు,వాటి వల్ల కలిగే నష్టాల గురించి, అలాగే రక్తహీనత,తక్కువ బరువు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించారు.
స్కూల్ హెడ్ మాస్టర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ,మన పూర్వీకులు చెప్పిన ఆహార పదార్థాలను వదిలేసి,పాశ్చాత్య దేశాల ఆహార పదార్థాలను ఇష్టపడడం వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారని, చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు.అక్షరాభ్యాసం కార్యక్రమం కూడా నిర్వహించారు. ప్రతిజ్ఞ కూడా చేశారు.ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హేమలత,కార్యదర్శి వెన్నెల,పోషణ అభియాన్ సిబ్బంది,అంగన్వాడీ టీచర్లు,లబ్ధిదారులు,పాల్గొన్నారు
