ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా దొంతరవేన రమేష్ యాదవ్

By dhanadhannews.com

జమ్మికుంట,ధనాధన్ న్యూస్:జమ్మికుంట మండల ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా మాచనపల్లి గ్రామ ఉపసర్పంచ్ దొంతరవేన రమేష్ యాదవ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం నిర్వహించిన మండల స్థాయి సమావేశంలో మండలంలోని 15 మంది ఉపసర్పంచ్‌లు రమేష్ యాదవ్‌కు మద్దతు తెలపడంతో ఆయనను అధ్యక్షుడిగా ఎంపిక చేశారు.ఈ సందర్భంగా రమేష్ యాదవ్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన సహచర ఉపసర్పంచ్‌లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో గ్రామాల సమగ్ర అభివృద్ధికి, ఉపసర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ కృషి చేస్తానని తెలిపారు.పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆశీస్సులతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకువచ్చే దిశగా ప్రయత్నాలు చేస్తానని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపసర్పంచ్‌లు పాల్గొన్నారు.