రసమయి కి చీర,సారే ప్రధానం చేసిన బిజెపి నాయకులు

By dhanadhannews.com

  • బండి సంజయ్ ని విమర్శిస్తే మానకొండూర్ ప్రజలు రసమయిని రోడ్డుమీద నగ్నంగా ఉరికిస్తారు
  • బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్

కరీంనగర్ బిఆర్ఎస్ సభలో మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్,కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ పై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బిజెపి మానకొండూర్ మండల శాఖ ఆధ్వర్యంలో రసమయి బాలకిషన్ కు చీరే, సారేను ప్రధానం చేసి నిరసన వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ బిజెపి మండల పార్టీ అధ్యక్షులు రాపాక ప్రవీణ్ మాట్లాడుతూ రసమయికి ఒళ్ళు కొవ్వెక్కి మాట్లాడుతున్నారని,బండి సంజయ్ ని విమర్శిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే హోదాలో ఉండి చిల్లర రాజకీయాలు చేయడం సిగ్గుచేటని అన్నారు.ఇద్దరు భార్యలు ఉన్న రసమయి రామభక్తుడు ఎలా అవుతాడని..? విమర్శించారు.ఇకపై చిల్లర రాజకీయాలు చేస్తే మానకొండూర్ ప్రజలు  రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తారు అని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి మండల ప్రధాన కార్యదర్శులు కత్తి ప్రభాకర్ గౌడ్, కంది రాజీరెడ్డి,సోన్నాకుల శ్రీనివాస్,మండల ఉపాధ్యక్షులు వ్యాట లక్ష్మారెడ్డి,ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్, బీజేవైఎం మండలాధ్యక్షులు భాషబోయిన ప్రదీప్ యాదవ్,ఉపాధ్యక్షులు కొండ్ర వరప్రసాద్,కాల్వ సాయికుమార్,నాయకులు నందగిరి బలరాం,మచ్చ రవీందర్,కోల శ్రీనివాస్,జంగిలి రాకేష్,ఆరెపల్లి సునంద్,పాకాల దేవేందర్ రెడ్డి,బుర్ల బన్ను,కోటి, మహేష్ పాల్గొన్నారు.