జమ్మికుంట,ధనా ధన్ న్యూస్.
బల్మూరి వెంకట్ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా దర్గాలో ప్రత్యేక పూజలు,పేద ప్రజలకు అన్నదానం,కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.
ఎమ్మెల్సీగా బల్మూరి వెంకట్ బుధవారం ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా జమ్మికుంట మండలంలోని బిజిగిరి షరీఫ్ గ్రామంలోని దర్గాలో కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ మైనార్టీ ఇన్చార్జ్ ఎండి సలీం పాషా,మాజీ జెడ్పీటిసీ అరుకాల వీరేశలింగం,జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కసుబోజుల వెంకన్న ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం మరియు 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పేద ప్రజల కోసం విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బల్మూరి వెంకట్ చేసిన కృషి వెలకట్టలేనిదని కొనియాడారు.
హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు,
విద్యార్థులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడని దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులతో బల్మూరి వెంకట్ రానున్న రోజుల్లో అంచెలంచెలుగా ఎదిగి ఉన్నత పదవులు అధిరోహించాలని అన్నారు. బల్మూరికి ఎమ్మెల్సీగా ఎన్నిక కావడానికి ఆశీర్వదించి అండగా నిలిచి తోడ్పాటు అందించిన సీఎం రేవంత్ రెడ్డికి,డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క కి,మంత్రులు పొన్నం ప్రభాకర్ గౌడ్, దుద్దిల్ల శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రణవ్ బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో వోల్లాల శ్రీనివాస్,నాయకులు చిన్నింటి నాగేంద్ర,పూరెళ్ళ రాకేశ్,అరుకాల కార్తీక్,పోతుల శ్రీనివాస్,తంగెళ్ళ క్రిష్ణా మోహన్,గొట్టే ప్రభుదాస్,చెంచల శ్రీనివాస్,గుర్రపు మురళి,మొలుగూరి సమ్మయ్య,గుర్రపు ప్రవీణ్,బోళ్ళ కుమార్,మైస సురేష్,గడ్డం రమేష్,అకినపెల్లి మహేందర్,రోమాల రాజ్కుమార్,దా
దొడ్డేశంకర్,మైస రవి,ద్యారంగుల నర్సయ్య, జమ్మికుంట 30 వ వార్డుల అద్యక్షులు,బిజిగీర్ షరీఫ్ దర్గా ప్రతినిధులు,కాంగ్రెస్ కార్యకర్తలు,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
