కేంద్రీయ విద్యాలయంపై రాజకీయాలు మానుకోవాలి: ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డా. ఎం. సంజయ్ కుమార్ మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై ఎంపీ ధర్మపురి అరవింద్ అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలకు స్పందిస్తూ, కేంద్రీయ విద్యాలయానికి అవసరమైన 5 ఎకరాల స్థల కేటాయింపు ప్రక్రియ పూర్తయిందని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో భూమి సర్వే నిర్వహించి, సంబంధిత పత్రాలను సుమారు పది రోజుల క్రితమే కేంద్రీయ విద్యాలయ సంఘటన్ డిప్యూటీ కమిషనర్‌కు […]

ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు:డాక్టర్ భోగ శ్రావణి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాలయానికి స్థలం కేటాయింపును అడ్డుకుంటున్నది ఎవరో స్పష్టం చేయాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని కమల నిలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు కనీస మర్యాదలు కూడా పాటించడం లేదని ఆమె విమర్శించారు. సభా మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో […]

అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన రాచర్ల గంగాధర్ నివాసాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం అందజేశారు.అగ్నిప్రమాదం నేపథ్యంలో సంబంధిత అధికారులతో జీవన్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. గంగాధర్ స్వయం ఉపాధితో జీవనం సాగించే నిరుపేద కుటుంబానికి […]

గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 10:జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌లో నిర్వహించిన శ్రీ గంగమ్మ జాతర ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గంగమ్మ తల్లికి బోనాలు ఎత్తుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లి కటాక్షంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, […]

తెలంగాణ భూములను దోచుకునే కుట్ర జరుగుతోంది: కల్వకుంట్ల కవిత

హైదరాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 06: తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్రంలో భారీ స్థాయిలో భూదందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. శనివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయల విలువైన భూములను బడాబాబులకు అప్పగించే కుట్ర చేస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ఇందుకు సంబంధించిన ఆధారాలను దశలవారీగా ప్రజల ముందుకు తీసుకువస్తానని తెలిపారు. తెలంగాణ భూములు, […]

జమ్మికుంటలో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 3: తెలంగాణ ఉద్యమ యోధుడు, రైతు బాంధవుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో టి హెచ్ ఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమీపంలోని శివాలయం (బొమ్మల గుడి)లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. టి హెచ్ ఆర్ టీం రాష్ట్ర కమిటీ మరియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ వర్మ అప్పని […]

కరీంనగర్ బంద్‌పై కాంగ్రెస్ ఫైర్.. బీజేపీ-బీఆర్ఎస్‌పై వొడితల ప్రణవ్ తీవ్ర విమర్శలు

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 9:బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలకు పాల్పడుతున్నాయని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ ఆరోపించారు. శనివారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.కరీంనగర్ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ పిలుపునివ్వడం వెనుక ఉద్దేశ్యం ఏమిటో స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికా లేక రాజకీయ బలప్రదర్శనకా ఈ బంద్ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు బయటకు పరస్పరం […]

కరీంనగర్‌లో శాంతిభద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ కలిసి కలసి వినతిపత్రం సమర్పించారు.ఇటీవల కరీంనగర్ నగరంలో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, […]

బత్తుల లక్ష్మీనారాయణను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్

సైదాపూర్/ధనాధన్ న్యూస్: సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు బత్తుల లక్ష్మీనారాయణ పక్షవాతం బారిన పడిన విషయం తెలిసిన వెంటనే మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్పందించారు. ప్రస్తుతం హనుమకొండలోని అజరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీనారాయణను ఆయన సందర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యులతో మాట్లాడిన సతీష్ కుమార్, ఆయనకు అత్యుత్తమ వైద్యం అందించాలని సూచించారు. త్వరగా కోలుకుంటారని నమ్మకం వ్యక్తం చేస్తూ, ఎలాంటి ఆందోళన […]

హుజురాబాద్‌లో బంద్ విజయవంతం – డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా ప్రజల ఐక్యరూపం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజురాబాద్‌లో ప్రతిపాదిత డంపింగ్ యార్డ్‌కు వ్యతిరేకంగా నిర్వహించిన బంద్ విజయవంతంగా సాగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరియు జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు తెలపడంతో పట్టణం పూర్తిగా మూతపడింది.బంద్ సందర్భంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నాయకత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించబడింది. అనంతరం ఆయన మాట్లాడుతూ, హుజురాబాద్ ప్రాంతంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం […]