జమ్మికుంటలో ఘనంగా పీవీ నరసింహారావు జయంతి వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, జూన్ 28: భారత మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణల పితామహుడు పాములపర్తి వెంకట నరసింహారావు జయంతి సందర్భంగా ఆదివారం జమ్మికుంట పట్టణంలోని క్లాక్ టవర్ వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కలిసి పీవీ నరసింహారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలు, విద్యా రంగం, విదేశాంగ విధానంలో ఆయన చేసిన కృషిని […]

ఎమర్జెన్సీకి భయపడలేదు..జైలులోనూ ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 25: దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించినప్పటికీ తాము వెనుకడుగు వేయలేదని, జైలులో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలను నిర్వహించామని ఆ సంఘం సీనియర్ కార్యకర్తలు తెలిపారు.జమ్మికుంటకు చెందిన మంతెన శ్రీమన్నారాయణ, హుజురాబాద్‌కు చెందిన కొమురవెల్లి సదానందం మాట్లాడుతూ, ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడామని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేశ శాంతి భద్రతల కోసం కార్యకర్తలుగా పనిచేస్తూ ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొన్నామని, సుమారు మూడు నెలల పాటు […]

పీఆర్‌సీ వెంటనే ప్రకటించాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని, వారికి రావాల్సిన పెండింగ్ బకాయిల చెల్లింపులో విఫలమైందని టీపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నన్నబోయిన తిరుపతి విమర్శించారు.బుధవారం జమ్మికుంటలో టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు డీఏలను విడుదల చేస్తామని, పీఆర్‌సీని ప్రకటించి ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపుతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటి వరకు ఆ హామీలను అమలు చేయలేదని […]

డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇల్లందకుంట ఎస్సై కాంత్రికుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై కాంత్రికుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో ఏర్పడే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత సరదాగా ప్రారంభించే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా […]

మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ సూచించారు.బుధవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తదితర అవసరమైన పత్రాలను […]

గ్రామ దేవతల ఆశీర్వాదం ప్రజలందరిపై ఉండాలి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: గ్రామ దేవతల ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఊర్లను కాపాడే అమ్మవార్లు ప్రజలకు ఇష్టమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నట్లు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు.శుక్రవారం రోజున జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో గ్రామ దేవతలైన శ్రీ మహాలక్ష్మి,భూ లక్ష్మీ,నాభి శిల (బొడ్రాయి),పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా గ్రామస్థులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం పోచమ్మ తల్లి దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జగ్గయ్యపల్లి గ్రామంలో […]

అద్దాల మేడలు, ప్లాస్టిక్ బొమ్మలు చూసి మోసపోకండి…!

జమ్మికుంట/ధనాధన్ న్యూస్, జూన్ 18: అద్దాలమేడలు, ప్లాస్టిక్ బొమ్మలు మీ పిల్లల భవిష్యత్తును మార్చలేవు, పిల్లలకు కావాల్సింది చదువు పొందాల్సిందే విజ్ఞానం “తోటోడు తొడ కోసుకుంటే నేను మెడ కోసుకుంటా ” అనే చందంగా ఉన్నది మన తల్లిదండ్రుల పరిస్థితి చిన్నపిల్లల చదువు కోసం లక్షల రూపాయలు వెచ్చించి అనవసరంగా ఆర్థిక నష్టాలు పొంది అప్పుల పాలవుతున్న పరిస్థితి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది, ఇలా ఎందుకు జరుగుతున్నది అంటే నేను పెద్ద స్కూల్లో […]

ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు:డాక్టర్ భోగ శ్రావణి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాలయానికి స్థలం కేటాయింపును అడ్డుకుంటున్నది ఎవరో స్పష్టం చేయాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని కమల నిలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు కనీస మర్యాదలు కూడా పాటించడం లేదని ఆమె విమర్శించారు. సభా మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో […]

గండి రంజిత్ కుమార్ గౌడ్‌కు తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 13: ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు వాటి పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ మీడియా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్టు గండి రంజిత్ కుమార్ గౌడ్‌కు ప్రతిష్టాత్మక తెలంగాణ స్ఫూర్తి నంది పురస్కారం లభించింది.జాతీయ స్వచ్ఛంద సేవా సంస్థ తెలుగు వెలుగు సాహితీ వేదిక ఆధ్వర్యంలో వరంగల్‌లోని టీఎన్‌జీవో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని ఆయన అందుకున్నారు.దాదాపు […]

కనగర్తి ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా “మన బడి – మన బాధ్యత” కార్యక్రమం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం 12 సంవత్సరాల సుపరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న “మన బడి – మన బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట మండలంలోని కనగర్తి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ సీనియర్ నాయకుడు మట్ట పవన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల […]