ఎమర్జెన్సీకి భయపడలేదు..జైలులోనూ ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహించాం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 25: దేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీ సమయంలో ఆర్ఎస్ఎస్‌పై నిషేధం విధించినప్పటికీ తాము వెనుకడుగు వేయలేదని, జైలులో కూడా ఆర్ఎస్ఎస్ శాఖలను నిర్వహించామని ఆ సంఘం సీనియర్ కార్యకర్తలు తెలిపారు.జమ్మికుంటకు చెందిన మంతెన శ్రీమన్నారాయణ, హుజురాబాద్‌కు చెందిన కొమురవెల్లి సదానందం మాట్లాడుతూ, ఎమర్జెన్సీ కాలంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడామని చెప్పారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేశ శాంతి భద్రతల కోసం కార్యకర్తలుగా పనిచేస్తూ ప్రభుత్వ నిర్బంధాలను ఎదుర్కొన్నామని, సుమారు మూడు నెలల పాటు జైలు జీవితం గడిపినట్లు గుర్తు చేసుకున్నారు.


ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుండటం ఆనందంగా ఉందని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు గుత్తికొండ రాజశేఖర్, ఆవాల రాజారెడ్డి, దాసరి రవీందర్, బుర్ర శివయ్య, కేతపల్లి మాధవరెడ్డి, ఎక్కడి రఘుతం రెడ్డి, గుడికందుల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment