మోడీ స్వచ్ఛత పిలుపుతో కదిలిన బీజేపీ శ్రేణులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 13:ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేపట్టిన స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో (గర్ల్స్ హైస్కూల్) శనివారం బీజేపీ నాయకులు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. “స్వచ్ఛ పాఠశాల – స్వచ్ఛ భారతం” అనే నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలు స్వయంగా శ్రమదానం చేసి పాఠశాల పరిసరాలను శుభ్రపరిచారు.ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించడంతో పాటు మొక్కల చుట్టూ పెరిగిన […]

ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన యువతి.. ప్రేమ వ్యవహారమే కారణమా?

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 11: గండ్రపల్లి గ్రామానికి చెందిన గుంటి అయిలయ్య (60) తన కుమార్తె గుంటి మమత (30) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న అయిలయ్యకు ఒక కుమారుడు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.చిన్న కుమార్తె మమత డిగ్రీ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది.పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిన ప్రతిసారి మమత తనకు ఇష్టం లేదని తిరస్కరిస్తూ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయమై తండ్రి అయిలయ్య పలుమార్లు ప్రశ్నించగా,మంచిర్యాలకు చెందిన రవికుమార్‌ను ప్రేమిస్తున్నానని మమత తెలిపినట్లు పేర్కొన్నారు. […]

లేఅవుట్‌లో లేని సర్వే నంబర్.. కొనుగోలుదారుడి చిక్కులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 9:ప్లాట్ కొనుగోలు విషయంలో సర్వే నంబర్ నమోదు లోపంతో రుణం తిరస్కరణకు గురైన బాధితుడి ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డే దుర్గాప్రసాద్ (46), ప్రస్తుతం జమ్మికుంటలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో ఉన్న అంజనా టౌన్‌షిప్‌లో 59వ నంబర్ ప్లాట్‌ను కొనుగోలు చేశారు.ఈ ప్లాట్‌ను జొన్నతుల కోనారెడ్డి, రాఘవరెడ్డి, గర్రెపల్లి […]

జమ్మికుంట ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 7: జమ్మికుంట మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఆదివారం జమ్మికుంటలోని స్థానిక సాయి గార్డెన్‌లో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సిరి రవి ఆధ్వర్యంలో నూతన కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తుమ్మ చందు అధ్యక్షతన ఎండి ముస్తఫా అధ్యక్షుడిగా, ఎర్రం రాజు, ఎండి అజార్ ఉపాధ్యక్షులుగా, దొడ్డే […]

దళితబంధు సాధన సమితి సభ్యులకు న్యాయం చేయాలి: కొలుగూరి నరేష్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 4: దళితబంధు రెండో విడతను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ జమ్మికుంట పట్టణంలో దళితబంధు సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం మీడియా సమావేశం నిర్వహించారు.అనంతరం సమితి నాయకులు జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. సమస్యపై వెంటనే స్పందించిన చైర్మన్, సంబంధిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ మరియు ఎస్సీ కార్పొరేషన్ ఈడీతో ఫోన్‌లో మాట్లాడి, ఒక వారంలో సమస్య పరిష్కారానికి […]

జమ్మికుంటలో ఘనంగా హరీష్ రావు జన్మదిన వేడుకలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 3: తెలంగాణ ఉద్యమ యోధుడు, రైతు బాంధవుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు జన్మదిన వేడుకలను జమ్మికుంట పట్టణంలోని గాంధీ చౌరస్తాలో టి హెచ్ ఆర్ టీం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం సమీపంలోని శివాలయం (బొమ్మల గుడి)లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. టి హెచ్ ఆర్ టీం రాష్ట్ర కమిటీ మరియు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు హరీష్ వర్మ అప్పని […]

క్రికెట్ ఫీవర్..పోలీసుల స్పెషల్ నిఘా..!

హుజూరాబాద్‌/ధనాధన్ న్యూస్,మే 31 :ఈ రోజు జరగనున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా హుజూరాబాద్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఏసీపీ వాసంశెట్టి మాధవి తెలిపారు. మ్యాచ్ నేపథ్యంలో ఎలాంటి బెట్టింగ్ కార్యకలాపాలు, అవాంఛనీయ ఘటనలు, గొడవలు చోటు చేసుకోకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఏసీపీ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ప్రధాన కూడళ్లు, ప్రజా రద్దీ ప్రాంతాలు, సున్నిత ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు తెలిపారు. […]

గుర్తు తెలియని మహిళ మృతి..వివరాలు తెలియజేయాలంటూ రైల్వే పోలీసుల విజ్ఞప్తి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 29:జమ్మికుంట – బిసుగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య జమ్మికుంట రైల్వే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహిళ ఎగువ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, లేక ఇతర కారణాలతో మృతి చెందిన అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం […]

దారి దోపిడీ కేసు ఛేదన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 21:కోరపల్లి గ్రామ రహదారిపై ఇటీవల చోటుచేసుకున్న దోపిడీ ఘటనను జమ్మికుంట పోలీసులు వేగంగా ఛేదించి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి తెలిపారు. గురువారం జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, మే 20వ తేదీ రాత్రి కోరపల్లి గ్రామం వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ 08 యూడీ 5457)ను 11 మంది […]

సిరిసేడు హైస్కూల్‌లో పదవ తరగతి విద్యార్థులకు ఘన సన్మానం

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్: ఇల్లందకుంట మండలంలోని సిరిసేడు ప్రభుత్వ హైస్కూల్‌లో ఈ విద్యా సంవత్సరంలో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రత్యేక సన్మాన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ రేణుకుంట్ల శ్యామల కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందిస్తూ ప్రైజ్ మనీ అందజేశారు. ఈ సందర్భంగా స్కూల్ ఫస్ట్ సాధించిన విద్యార్థికి రూ.5,000, స్కూల్ సెకండ్ వచ్చిన విద్యార్థికి రూ.3,000, స్కూల్ థర్డ్ స్థానం పొందిన విద్యార్థికి రూ.2,000 నగదు బహుమతులను అందించారు. విద్యార్థులు […]