మృగశిర కార్తె సందర్భంగా ఉచిత ఆయుర్వేద మందు పంపిణీ

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లా కేంద్రంలోని చింతకుంట చెరువు సమీపంలో ఉన్న శ్రీ సూర్య భగవాన్ ధన్వంతరి ఆలయంలో మృగశిర కార్తె సందర్భంగా భక్తులకు మృగశిర ఆయుర్వేద ఔషధాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ, మృగశిర కార్తె రోజున ఈ ఔషధాన్ని సేవించడం వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, జలుబు, దగ్గు, ఆస్తమా, ఈసినోఫిలియా తదితర అలర్జీ సమస్యల నుంచి ఉపశమనం లభించడమే కాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. […]

అంతర్గాంలో మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవ ప్రారంభం

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జగిత్యాల రూరల్ మండలం అంతర్గాం గ్రామంలో సర్పంచ్ కంటెస్టెడ్ అభ్యర్థి కోల భవాని-అరుణ్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మహిళల కోసం ఉచిత ఆటో ప్రయాణ సేవను సోమవారం ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మహిళలకు ఉచిత ఆటో ప్రయాణ సేవను ప్రారంభించి మాట్లాడారు. మహిళల సంక్షేమం, సౌకర్యాల కల్పనకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ మహిళల […]

జర్నలిస్టుల పిల్లలకు స్కూల్ ఫీజుల్లో 50 శాతం రాయితీ కల్పించాలి

జగిత్యాల/ధనాధన్ న్యూస్ జూన్ 8: జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్ పాఠశాలల్లో 50 శాతం ఫీజు రాయితీ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జర్నలిస్టుల ప్రతినిధులు సోమవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సమాజానికి సమాచారాన్ని అందిస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. అయితే తక్కువ ఆదాయంతో పనిచేస్తున్న పలువురు జర్నలిస్టులు తమ పిల్లల విద్యా ఖర్చులను భరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. […]

దివంగత మిత్రుని కుటుంబానికి రూ.50 వేల ఆర్థిక సాయం

హుస్నాబాద్/ధనాధన్ న్యూస్,జూన్ 7: స్నేహం అంటే కేవలం కలిసి చదవడం, కలుసుకోవడం మాత్రమే కాదని, కష్టకాలంలో ఒకరికొకరు అండగా నిలవడమేనని హుస్నాబాద్ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు మరోసారి నిరూపించారు.సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన బొడిగ తిరుపతి గత నెల 24న అనారోగ్యంతో అకాల మరణం చెందగా,ఆయన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు తోటి పూర్వ విద్యార్థులు ముందుకొచ్చారు.1996–2016 మధ్య హుస్నాబాద్ గురుకుల పాఠశాలలో తిరుపతితో కలిసి చదువుకున్న స్నేహితులు నిజాం కళాశాల ప్రొఫెసర్ వేల్పుల […]

హుజురాబాద్‌లో ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్ నాయకులకు అవగాహన కార్యక్రమం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్,మే 29:కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎస్‌ఐఆర్ (SIR) అంశంపై గ్రామ గ్రామాన ప్రజలకు అవగాహన కల్పించాలని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎస్‌ఐఆర్ సమన్వయకర్త, కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి ఎస్‌ఐఆర్ అవగాహన కార్యక్రమం హుజురాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో […]

గుర్తు తెలియని మహిళ మృతి..వివరాలు తెలియజేయాలంటూ రైల్వే పోలీసుల విజ్ఞప్తి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 29:జమ్మికుంట – బిసుగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య జమ్మికుంట రైల్వే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహిళ ఎగువ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, లేక ఇతర కారణాలతో మృతి చెందిన అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం […]