ఎమ్మెల్యే ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారు:డాక్టర్ భోగ శ్రావణి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 17: జగిత్యాల అభివృద్ధిపై ఎమ్మెల్యే ప్రజలకు సమాధానం చెప్పాలని, కేంద్ర విద్యాలయానికి స్థలం కేటాయింపును అడ్డుకుంటున్నది ఎవరో స్పష్టం చేయాలని బీజేపీ జగిత్యాల నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ భోగ శ్రావణి డిమాండ్ చేశారు. జగిత్యాలలోని కమల నిలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు.అధికారిక కార్యక్రమాల్లో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులకు కనీస మర్యాదలు కూడా పాటించడం లేదని ఆమె విమర్శించారు. సభా మర్యాదల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్యేకు ఉందా అని ప్రశ్నించారు. కార్యక్రమాల్లో […]
జగిత్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ఐఎంఏ ముందడుగు

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: మాదకద్రవ్యాల వ్యసన నిర్మూలనకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 26న నిర్వహించనున్న “యాంటీ డ్రగ్ 3కే రన్” కార్యక్రమ కరపత్రాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్ శనివారం ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువతను లక్ష్యంగా చేసుకుని విస్తరిస్తున్న మాదకద్రవ్యాల వ్యసనం దేశ భవిష్యత్తుకు తీవ్రమైన ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ దుర్వినియోగంపై ప్రజల్లో, ముఖ్యంగా […]
అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి అండగా జీవన్ రెడ్డి

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 13: జగిత్యాల పట్టణంలోని 40వ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయిన రాచర్ల గంగాధర్ నివాసాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ తాటిపర్తి జీవన్ రెడ్డి శనివారం సందర్శించి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి ఆర్థిక సహాయం అందజేశారు.అగ్నిప్రమాదం నేపథ్యంలో సంబంధిత అధికారులతో జీవన్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడి ఘటన వివరాలను తెలుసుకున్నారు. గంగాధర్ స్వయం ఉపాధితో జీవనం సాగించే నిరుపేద కుటుంబానికి […]
మోచి బజార్‌లో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం

జగిత్యాల/ధనాధన్ న్యూస్,జూన్ 12:జగిత్యాల పట్టణంలోని మోచి బజార్ ప్రాంతంలో శుక్రవారం షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంటిలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇంటిలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్‌తో ఘటన స్థలానికి చేరుకుని సకాలంలో స్పందించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో ఇంటిలోని కొంత సామగ్రి దగ్ధమైనట్లు తెలిసింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం.అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న జగిత్యాల […]
గంగమ్మ తల్లికి బోనాలు సమర్పించిన మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్

జగిత్యాల/ధనాధన్ న్యూస్, జూన్ 10:జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌లో నిర్వహించిన శ్రీ గంగమ్మ జాతర ఉత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ గంగమ్మ తల్లికి బోనాలు ఎత్తుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గంగమ్మ తల్లి కటాక్షంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని అడువాల జ్యోతి లక్ష్మణ్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, మహిళలు, […]
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

బుగ్గారం/ధనాధన్ న్యూస్ జూన్ 9:జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రానికి చెందిన కౌలు రైతు, దళిత రైతు మానాల పెద్ద దుబ్బయ్య (60) అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. కౌలుకు తీసుకున్న పొలాల సమీపంలోనే ఆయన మృతదేహం లభించింది. కుటుంబ సభ్యులు, బుగ్గారం ఎస్సై జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం, పెద్ద దుబ్బయ్య పలువురు రైతుల భూములను కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే ఇటీవల […]
నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకెట్ హాల్ నిర్మాణం

మెట్‌పల్లి/ధనాధన్ న్యూస్,జూన్ 8: జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని 63వ జాతీయ రహదారిని ఆనుకుని నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకెట్ హాల్ నిర్మాణం జరుగుతోందని ఆరోపిస్తూ, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని వంకాయల ముఖేష్ చంద్ర జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ, జాతీయ రహదారి పక్కనే ఎలాంటి షెడ్‌బ్యాక్ లేకుండా బ్యాంకెట్ హాల్ నిర్మాణ పనులు చేపడుతున్నారని తెలిపారు. నిర్మాణ స్థలం పక్కగా, […]
