మీ ఙ్ఞాపకాలు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాయి

నడికూడ, ధనాధన్ న్యూస్ : హనుమకొండ జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మొగిలి విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి మస్టర్ డిమాండ్ నమోదు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న నడికూడ మండల ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో విద్యావతి,ఈసీ రజనీకాంత్‌తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు మొగిలి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ […]

వెంకటేశ్వర్లపల్లికీ దేవుడు దిక్కు

నడికూడ, ధనాదన్ న్యూస్: పరకాల నియోజకవర్గ పరిధిలోని నడికూడ మండల పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామంకు ఉన్న రోడ్స్ మా గ్రామ పరిధిలో వాగు నుంచి వెంకటేశ్వర్లపల్లి వరకు వెంకటేశ్వర్లపల్లి నుండి మర్రిపల్లిగూడెం వరకు నిన్న గ్రామ ప్రజల సహకారంతో 6కి.మీ మోరం పోయడం జరిగిందని గత ప్రభుత్వం వాగు నుంచి వెంకటేశ్వర్లపల్లి వరకు గత మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఎంఆర్ఆర్ గ్రాంట్ నుంచి 1కోటి 50లక్షల మంజూరు చేయడం జరిగిందని ఈ పనులు చేయడం లేదని […]

నడికూడ మండల ఉత్తమ టీచర్లకు సన్మానం

నడికూడ, ధనాధన్ న్యూస్ : “డా. సర్వేపల్లి రాధాకృష్ణన్” గారి జయంతిని పురస్కరించుకొని నడికూడ మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులను సన్మానించే కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాశాఖ అధికారి  హనుమంతరావు అధ్యక్షత వహించగా,ఎంపీడీవో రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా నడికూడ మండలంలోని వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసిన 16 మంది ఉత్తమ ఉపాధ్యాయులను […]

జనం మెచ్చిన ఏఎల్ఎం ప్రసాద్ పనితీరు బేష్

నడికూడ, ధనాధన్ న్యూస్ :  హనుమకొండ జిల్లా నడికూడ మండలం కంఠాత్మకూర్ తో పాటు రెండు గ్రామాలకు విద్యుత్‌కు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఏఎల్‌ఎం ప్రసాద్ చొరవ చూపుతున్నారని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాత్రి,పగలు అనే తేడా లేకుండా సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే స్పందించి,పరిష్కారం అయ్యే వరకు సంబంధిత సిబ్బందితో సమన్వయం చేస్తున్నారని తెలిపారు. ఫోన్ ద్వారా కానీ,గ్రామ వాట్సాప్ గ్రూపుల ద్వారా కానీ సమాచారం అందిన వెంటనే అసిస్టెంట్ పొన్నగంటి కర్ణాకర్‌తో కలిసి […]

నర్సక్కపల్లిలో పోషణ మాసం కార్యక్రమం

నడికుడ,ధనాధన్ న్యూస్: పోషణ మాస కార్యక్రమంలో భాగంగా నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామంలోని ఒకటి,నాలుగు అంగన్వాడి సెంటర్ జిపి స్థాయిలో కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల సీడీపీఓ స్వాతి పాల్గొని మాట్లాడుతూ అంగన్వాడీలో అందించే సేవల గురించి,గర్భిణీల తీసుకోవాల్సిన జాగ్రత్తలు,పిల్లల పోషకాహారం, ఆకుకూరల ప్రాముఖ్యత, పోషకాహారం తీసుకోకపోవడం వల్ల వచ్చే అనారోగ్యాలు,వాటి వల్ల కలిగే నష్టాల గురించి, అలాగే రక్తహీనత,తక్కువ బరువు వల్ల వచ్చే ఆరోగ్య సమస్యల గురించి వివరించారు. స్కూల్ హెడ్ […]

ప్రీ ప్రైమరీ విద్యతో చిన్నారులకు బంగారు భవిష్యత్తు

నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీలో చేరిన చిన్నారులకు పాఠశాల ఆధ్వర్యంలో వర్క్‌బుక్స్‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ ముదిరాజ్ చిన్నారులకు వర్క్‌బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల విద్యాభ్యాసానికి ప్రీ ప్రైమరీ విద్య ఎంతో ఉపయోగకరమన్నారు. చిన్న వయసులోనే పిల్లల్లో […]

పోషకాహారంతో తల్లి, బిడ్డల ఆరోగ్యం

నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండల కేంద్రంలోని నడికూడ సెక్టార్‌ పరిధిలోని నడికూడ-4వ సెంటర్, గొల్లపల్లి అంగన్‌వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హేమలత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. ప్రతి నెల అంగన్‌వాడీ కేంద్రాల్లో నిర్వహించే ఈసీసీఈ డే కార్యక్రమానికి […]

కాంగ్రెస్ నుంచి చాడ తిరుపతిరెడ్డి సస్పెండ్

నడికూడ,ధనాధన్ న్యూస్: కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు, క్రమశిక్షణకు ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు అన్నారు. పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించే వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.నడికూడ మండల కేంద్రంలోని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సమన్వయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, స్థానిక ఎమ్మెల్యే ఆదేశాల మేరకు చర్లపల్లి గ్రామ మాజీ సర్పంచ్ చాడ తిరుపతిరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. చర్లపల్లి […]