ఉద్యోగ విరమణ పొందిన ఎస్‌బీ డీఎస్పీ వెంకటరమణకు ఘన సన్మానం

జగిత్యాల,జూన్ 30(ధనాధన్ న్యూస్): జిల్లా స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) డీఎస్పీ వెంకటరమణ ఉద్యోగ విరమణ సందర్భంగా జగిత్యాల పట్టణంలోని వీకేబీ ఫంక్షన్ హాల్‌లో మంగళవారం ఘన వీడ్కోలు, సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై వెంకటరమణను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, పోలీసు శాఖలో వెంకటరమణ ఎన్నో సంవత్సరాల పాటు అంకితభావం, నిజాయితీ, క్రమశిక్షణతో సేవలందించి […]
మడిపెల్లి హత్య కేసు ఛేదించిన పోలీసులు..నిందితుడి అరెస్ట్

జమ్మికుంట,జూన్ 29 (ధనాధన్ న్యూస్): మడిపెల్లి గ్రామంలో ఇటీవల జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం మడిపెల్లి గ్రామానికి చెందిన గంగారపు మహేష్ (40)ను అదుపులోకి తీసుకుని విచారించగా, కేసుకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.జమ్మికుంట పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హుజురాబాద్ ఏసిపి మాధవి తెలిపిన వివరాల ప్రకారం,తన వ్యవసాయ భూమి సమీపంలో కౌలుకు వ్యవసాయం చేస్తున్న ఓ వివాహిత […]
డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

ఇల్లందకుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఇల్లందకుంట ఎస్సై కాంత్రికుమార్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మత్తు పదార్థాల వ్యతిరేక మరియు అక్రమ రవాణా నిరోధక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మండల కేంద్రంలో స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్సై కాంత్రికుమార్ మాట్లాడుతూ, డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో ఏర్పడే దుష్పరిణామాలు, ఆరోగ్య సమస్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. యువత సరదాగా ప్రారంభించే ఈ అలవాటు క్రమంగా వ్యసనంగా […]
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 24: మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయని, ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జమ్మికుంట పట్టణ సీఐ రామకృష్ణ గౌడ్ సూచించారు.బుధవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), ఇన్సూరెన్స్, పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ తదితర అవసరమైన పత్రాలను […]
తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి భూమి రిజిస్ట్రేషన్

మెట్‌పల్లి/ధనాధన్ న్యూస్,జూన్ 14: జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పత్రాలతో భూమి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు మెట్‌పల్లి పోలీసులు ఆదివారం వివరాలు వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, మెట్‌పల్లి పట్టణంలోని ఆరపేట వార్డు శివారులో ఉన్న సర్వే నంబర్ 191 భూమికి సంబంధించి నిందితులు నకిలీ ఆబాది సర్టిఫికేట్ రూపొందించారు. తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేయడంతో పాటు నకిలీ ముద్రలను ఉపయోగించి తప్పుడు […]
బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీలు మాయం

బుగ్గారం/ధనాధన్ న్యూస్,జూన్ 13: జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్‌లో సీసీటీవీ ఫుటేజీలు అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేపట్టాలని సీనియర్ జర్నలిస్టు చుక్క గంగారెడ్డి శనివారం బుగ్గారం ఎస్సై జి. సతీష్‌కు ఫిర్యాదు చేశారు.ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, 2022 మే 1న బుగ్గారం పోలీస్ స్టేషన్ ఎదుట తనపై హత్యాయత్నం దాడి జరిగిందని తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి అప్పటి ఎస్సై గుడికందుల సందీప్ కేసు నమోదు చేశారని […]
ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన యువతి.. ప్రేమ వ్యవహారమే కారణమా?

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 11: గండ్రపల్లి గ్రామానికి చెందిన గుంటి అయిలయ్య (60) తన కుమార్తె గుంటి మమత (30) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న అయిలయ్యకు ఒక కుమారుడు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.చిన్న కుమార్తె మమత డిగ్రీ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది.పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిన ప్రతిసారి మమత తనకు ఇష్టం లేదని తిరస్కరిస్తూ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయమై తండ్రి అయిలయ్య పలుమార్లు ప్రశ్నించగా,మంచిర్యాలకు చెందిన రవికుమార్‌ను ప్రేమిస్తున్నానని మమత తెలిపినట్లు పేర్కొన్నారు. […]
లేఅవుట్‌లో లేని సర్వే నంబర్.. కొనుగోలుదారుడి చిక్కులు

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ జూన్ 9:ప్లాట్ కొనుగోలు విషయంలో సర్వే నంబర్ నమోదు లోపంతో రుణం తిరస్కరణకు గురైన బాధితుడి ఫిర్యాదు మేరకు జమ్మికుంట పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు.పోలీసుల వివరాల ప్రకారం.. పెద్దంపల్లి గ్రామానికి చెందిన దొడ్డే దుర్గాప్రసాద్ (46), ప్రస్తుతం జమ్మికుంటలోని ఎంపీపీఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని ధర్మారం గ్రామంలో ఉన్న అంజనా టౌన్‌షిప్‌లో 59వ నంబర్ ప్లాట్‌ను కొనుగోలు చేశారు.ఈ ప్లాట్‌ను జొన్నతుల కోనారెడ్డి, రాఘవరెడ్డి, గర్రెపల్లి […]
ఎండదెబ్బతో గొర్రెల కాపరి మృతి

సైదాపూర్/ధనాధన్ న్యూస్ జూన్ 5: మండలంలోని పెర్కపల్లి గ్రామానికి చెందిన ఓ యువకుడు ఎండదెబ్బ తగిలి మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పిల్లి శ్రీశైలం (29) గురువారం ఉదయం గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. మధ్యాహ్న సమయంలో తీవ్ర ఎండ ప్రభావంతో తల తిరగడం, వాంతులు, విరేచనాలు అవుతున్నాయని తన తండ్రి పిల్లి తిరుపతికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో తిరుపతి గ్రామానికి చెందిన […]
దారి దోపిడీ కేసు ఛేదన

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 21:కోరపల్లి గ్రామ రహదారిపై ఇటీవల చోటుచేసుకున్న దోపిడీ ఘటనను జమ్మికుంట పోలీసులు వేగంగా ఛేదించి, ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు హుజురాబాద్ ఏసీపీ వి. మాధవి తెలిపారు. గురువారం జమ్మికుంట పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె కేసు వివరాలను వెల్లడించారు.పోలీసుల కథనం ప్రకారం, మే 20వ తేదీ రాత్రి కోరపల్లి గ్రామం వైపు వెళ్తున్న అశోక్ లేలాండ్ వాహనం (టీఎస్ 08 యూడీ 5457)ను 11 మంది […]
