ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయిన యువతి.. ప్రేమ వ్యవహారమే కారణమా?

జమ్మికుంట/ధనాధన్ న్యూస్,జూన్ 11: గండ్రపల్లి గ్రామానికి చెందిన గుంటి అయిలయ్య (60) తన కుమార్తె గుంటి మమత (30) అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న అయిలయ్యకు ఒక కుమారుడు,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.చిన్న కుమార్తె మమత డిగ్రీ వరకు చదివి ఇంటి వద్దనే ఉంటోంది.పెళ్లి సంబంధాలు తీసుకొచ్చిన ప్రతిసారి మమత తనకు ఇష్టం లేదని తిరస్కరిస్తూ వచ్చిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ విషయమై తండ్రి అయిలయ్య పలుమార్లు ప్రశ్నించగా,మంచిర్యాలకు చెందిన రవికుమార్‌ను ప్రేమిస్తున్నానని మమత తెలిపినట్లు పేర్కొన్నారు.


అయితే గురువారం (జూన్ 11) తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల మధ్య కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో మమత ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిందని ఫిర్యాదులో తెలిపారు. ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఆమె ఎరుపు రంగు టీ-షర్ట్, నైట్ ప్యాంట్ ధరించి ఉన్నట్లు పేర్కొన్నారు.ఆమె ఎత్తు సుమారు 5.4 అడుగులు ఉండి,చామనఛాయ రంగు కలిగి ఉంటుందని వివరించారు.కుమార్తె కోసం బంధువులు,స్నేహితుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదని,ఆమె మంచిర్యాలకు చెందిన రవికుమార్ వద్దే ఉండి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయిలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a comment