గుర్తు తెలియని మహిళ మృతి..వివరాలు తెలియజేయాలంటూ రైల్వే పోలీసుల విజ్ఞప్తి

జమ్మికుంట/ధనాధన్ న్యూస్ మే 29:జమ్మికుంట – బిసుగిరిషరీఫ్ రైల్వే స్టేషన్ల మధ్య జమ్మికుంట రైల్వే ఎలక్ట్రిక్ సబ్ స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ప్రభుత్వ రైల్వే పోలీసులు తెలిపారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, మహిళ ఎగువ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని, లేక ఇతర కారణాలతో మృతి చెందిన అవకాశాలు ఉన్నాయని పోలీసులు అనుమానం వ్యక్తం […]
బండి భగీరథ్ అరెస్టుకు టీజేఎస్ మహిళా విభాగం డిమాండ్

హైదరాబాద్/ధనాధన్ న్యూస్ మే 16:మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) మహిళా విభాగం రాష్ట్ర మహిళా కమిషన్‌ను కోరింది. ఈ మేరకు టీజేఎస్ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అరికిల్ల స్రవంతి, ముత్తు గీతాంజలి, మహిళా నాయకురాలు లావణ్య శనివారం మహిళా కమిషన్ చైర్మన్‌కు వినతిపత్రం సమర్పించారు. వినతిపత్రంలో వారు పేర్కొన్నదేమిటంటే… బాధిత మైనర్ […]
కరీంనగర్‌లో శాంతిభద్రతలపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు

కరీంనగర్/ధనాధన్ న్యూస్: కరీంనగర్‌లో రోజురోజుకీ దిగజారుతున్న శాంతిభద్రతల పరిస్థితిపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్‌ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్, ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్‌తో పాటు ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, దాసోజు శ్రవణ్ కలిసి కలసి వినతిపత్రం సమర్పించారు.ఇటీవల కరీంనగర్ నగరంలో వరుసగా జరుగుతున్న జ్యూవెలరీ షాపుల దొంగతనాలు, ప్రజలపై దాడులు, […]
‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’పై అవగాహన సదస్సు నిర్వహణ

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: మెప్మా ఆధ్వర్యంలో స్థానిక వినాయక గార్డెన్‌లో గురువారం ‘ఉద్యమ్ రిజిస్ట్రేషన్’పై ప్రత్యేక అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆధ్వర్యంలో, టీఎల్ఎఫ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి కరీంనగర్ పీడీ స్వరూప రాణి, మున్సిపల్ చైర్‌పర్సన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (MSME) మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం వ్యాపార […]
జమ్మికుంట బీజేపీ ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్ నియామకం

జమ్మికుంట/ధనధాన్ న్యూస్: జమ్మికుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎస్సీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా పుల్లూరి ప్రశాంత్‌ను నియమించారు. ఈ నియామకం పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ప్రశాంత్ మాట్లాడుతూ, వార్డ్ బూత్ అధ్యక్షుడిగా పనిచేసిన తనను పట్టణ అధ్యక్షుడిగా ఎంపిక చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకం ఉంచి అవకాశం కల్పించిన జిల్లా అధ్యక్షుడు కృష్ణరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కొలకాని రాజు, […]
మహనీయుల జయంతులను ఘనంగా నిర్వహించాలి

హుజూరాబాద్/ధనాధన్ న్యూస్: ఏప్రిల్ నెలను “మహనీయుల పండగ నెల”గా గుర్తించి, వారి జయంతులను ఘనంగా నిర్వహించాలని దళిత రత్న వడ్డూరి కుమారస్వామి పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఏప్రిల్ నెల అంటే కేవలం ‘ఏప్రిల్ ఫూల్’ మాత్రమే కాదు, దేశ చరిత్రలో చిరస్మరణీయులైన మహనీయులు జన్మించిన గొప్ప నెల” అని పేర్కొన్నారు. భారతదేశానికి విశేష సేవలు అందించిన మహానుభావులలో, అగ్రవర్గ ఆధిపత్యాన్ని ఎదిరించి హక్కుల కోసం పోరాడాలని పిలుపునిచ్చిన ప్రముఖ నాయకుడు […]
డంపింగ్ యార్డు స్థల మార్పిడికి కట్టుబడి ఉన్నాం

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్ పట్టణంలో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన డంపింగ్ యార్డు స్థలాన్ని మార్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. గురువారం పట్టణంలోని కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ, ఆయనను వెంటనే ఎమ్మెల్యే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ప్రణవ్ డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో రీల్స్, లైకులు పొందడానికే పరిమితమై, ప్రజా సమస్యల […]
హుజూరాబాద్‌లో మున్సిపల్ కార్మికుల నిరసన – లేబర్ కోడ్ల రద్దు కోరుతూ ఆందోళన

హుజురాబాద్/ధనాధన్ న్యూస్: హుజూరాబాద్‌లో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని అటెండెన్స్ పాయింట్ వద్ద మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా వ్యతిరేకించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అలాగే 2021 సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. […]
హుజూరాబాద్‌కు మరిన్ని బస్ సర్వీసులు – మంత్రిని కలిసిన ప్రణవ్

హైదరాబాద్/ధనా ధన్ న్యూస్: హుజూరాబాద్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలకు కొత్త బస్ సర్వీసులను మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రిని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని మంత్రి నివాసంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. నియోజకవర్గంలోని బస్ స్టేషన్లలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించాలని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను పరిశీలించి […]
అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా ముందస్తు అరెస్ట్ – వడ్డెర సంఘం నేత ఆగ్రహం

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: తెలంగాణ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించనున్న అసెంబ్లీ ముట్టడికి వెళ్తుండగా, వడ్డెర సంఘం జమ్మికుంట మండల అధ్యక్షుడు పల్లపు రవిని పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పల్లపు రవి మాట్లాడుతూ, వడ్డెర కార్పొరేషన్ ఏర్పాటు అయ్యేవరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా వెనక్కి తగ్గబోమని హెచ్చరించారు.అలాగే, వడ్డెర కులాన్ని ఎస్టీ (ST) జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. […]
