శభాష్..సర్పంచ్ సబ్

నడికూడ, ధనాధన్ న్యూస్ : హనుమకొండ జిల్లా నడికూడ మండల కేంద్రంలో స్థానిక సర్పంచ్ కుడ్ల మలహల్ రావు ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు కోతుల నుండి విముక్తి కల్పించాలని కోతులు పట్టే వారిని పిలిపించి కోతులను పట్టించారు.వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ,వారి కష్టసుఖాలలో పాలుపంచుకుంటూ వారికి ఏ ఆపద వచ్చిన ఆదుకుంటానని కోతుల వల్ల సమస్యలు ఉన్నాయని ప్రజలు వివరించడంతో తక్షణమే స్పందించి కోతులను పట్టించడం పట్ల శభాష్.. సర్పంచ్ మలహలరావు సాబ్ […]
హుస్సేన్ పల్లిలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

పరకాల, ధనాధన్ న్యూస్: తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని హుస్సేన్ పల్లి గ్రామంలో ఘనంగా ప్రారంభమయ్యాయి.బతుకమ్మ పండుగలో తొలి రోజైన ఎంగిలిపూల బతుకమ్మను గ్రామ మహిళలు భక్తిశ్రద్ధలతో,ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా బతుకమ్మలను పేర్చి,ఒకచోట చేరి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరి సంప్రదాయ పాటలు పాడుతూ,కోలాటాలు,ఆటపాటలతో సందడి చేశారు. గ్రామంలో పండుగ వాతావరణం […]
మీ ఙ్ఞాపకాలు మా హృదయాల్లో ఎప్పటికీ ఉంటాయి

నడికూడ, ధనాధన్ న్యూస్ : హనుమకొండ జిల్లా నడికూడ మండలం చౌటుపర్తి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మొగిలి విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం రాత్రి మస్టర్ డిమాండ్ నమోదు చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆయన మృతి చెందినట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న నడికూడ మండల ఎంపీడీవో రామకృష్ణ, ఏపీవో విద్యావతి,ఈసీ రజనీకాంత్‌తో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు మొగిలి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ […]
ప్రీ ప్రైమరీ విద్యతో చిన్నారులకు బంగారు భవిష్యత్తు

నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండలం చర్లపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో 2026–27 విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రీ ప్రైమరీలో చేరిన చిన్నారులకు పాఠశాల ఆధ్వర్యంలో వర్క్‌బుక్స్‌ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ బండి రేణుక శంకర్ ముదిరాజ్ చిన్నారులకు వర్క్‌బుక్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల విద్యాభ్యాసానికి ప్రీ ప్రైమరీ విద్య ఎంతో ఉపయోగకరమన్నారు. చిన్న వయసులోనే పిల్లల్లో […]
పోషకాహారంతో తల్లి, బిడ్డల ఆరోగ్యం

నడికూడ, ధనాధన్ న్యూస్: నడికూడ మండల కేంద్రంలోని నడికూడ సెక్టార్ పరిధిలోని నడికూడ-4వ సెంటర్, గొల్లపల్లి అంగన్వాడీ కేంద్రాల్లో ఐసీడీఎస్ సూపర్వైజర్ హేమలత ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా హేమలత మాట్లాడుతూ స్థానికంగా లభించే ఆకుకూరలు, కూరగాయలతో పాటు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. పోషకాహారం తీసుకోవడం ద్వారా తల్లి, బిడ్డల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చన్నారు. ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహించే ఈసీసీఈ డే కార్యక్రమానికి […]
తపస్ ఆధ్వర్యంలో ఘనంగా గురు వందనం

హనుమకొండ, ధనాధన్ న్యూస్: తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ‘గురు వందనం’ కార్యక్రమాన్ని హనుమకొండలోని ఏబీవీపీ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రదానం చేశారు.సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర మరపురానిదని, విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ విశేష సేవలు చేస్తున్న ఉపాధ్యాయులను గౌరవించడం అభినందనీయమని తపస్ జిల్లా అధ్యక్షుడు బత్తిని వీరస్వామి, ప్రధాన కార్యదర్శి మూల రామకృష్ణ […]
పోలంపల్లి గ్రామంలో ఎస్బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం

మహముత్తారం/ధనాధన్ న్యూస్, జూలై 19: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఆదివారం రామ్కీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎస్బీఐ సంజీవని క్లినిక్ ఆన్ వీల్స్ ప్రాజెక్టు ద్వారా ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు.ఈ శిబిరంలో సుమారు 200 మంది గ్రామస్తులు పాల్గొని ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు అవసరమైన వారికి హిమోగ్లోబిన్ (HB), గ్రూప్ రాండమ్ బ్లడ్ షుగర్ […]
మృతుడి కుటుంబానికి ప్రమాద బీమా చెక్కు అందజేత
42శాతం రిజర్వేషన్లు అమలు అందరి బాధ్యత

హన్మకొండ/ధనాధన్ న్యూస్: ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్థానిక సంస్థల్లో 42శాతం రిజర్వేషన్ ఆగదని, ఆర్డినెన్స్ తెచ్చుటకు విపక్షాలు సహకరించాలని ఫూలే ఆశయ సాధన సమితి (పాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అన్నారు. సోమవారం కాకతీయ యూనివర్సిటీ లోని జర్నలిజం విభాగంలో ఫూలే ఆశయ సాధన సమితి ఉమ్మడి జిల్లా అధ్యక్షులు డాక్టర్ తాడూరి శాస్త్రి ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా సమావేశం జరిగింది. దీనికి పాస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ ముఖ్యఅతిధిగా […]
ఆదివాసి ఎరుకల కులస్తులకు అండగా ఉంటాం

వరంగల్/ధనాధన్ న్యూస్: బిఆర్ఎస్ పార్టీ రజతోఉత్సవ సభ పరిశీలన సందర్భంగా వరంగల్ మీదుగా ఎలుకతుర్తికి వచ్చిన కే కవితక్కని తెలంగాణ ఆదివాసి ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున ఆదివాసి ఎరుకల సమస్యల పరిష్కరించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అనంతరం రాష్ట్ర అధ్యక్షులు లోకిని రాజు ( నాంచారమ్మ ) ఎరుకల బుట్టను ఇచ్చి స్వాగతం పలికారు.కవితక్క ఆదివాసి ఎరుకల జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ గత కేసీఆర్ […]
