ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

By dhanadhannews.com

  • కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్

ఇల్లందకుంట,ధనాధన్ న్యూస్:

ఉచిత వైద్య శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నియోజవర్గ ఇంచార్జీ వొడితల ప్రజలకు సూచించారు. ఆదివారం ఇళ్ళందకుంట మండలం రాచపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జమ్మికుంట పట్టణానికి చెందిన సంజీవని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జీ వొడితల ప్రణవ్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి,ఈ మెగా వైద్య శిబిరంలో ఐదు రకాల వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి రోగులకు అవసరమైన మందులు అందించిన ఆసుపత్రి వైద్యులను ఆయన అభినందించారు.  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించుటకు ఆరోగ్యశ్రీని ఐదు లక్షల నుండి పది లక్షల వరకు పెంచడం జరిగిందని భవిష్యత్తులో మరింత మెరుగైన వైద్యాన్ని అందించడం చేయడం జరుగుతుందని అన్నారు.ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దొంతుల రాజేశం, మడిపల్లి సంతోష్ మడిపల్లి కుమార్ మాచర్ల నాగరాజు లను అభినందించారు.ఈ శిబిరంలో సుమారు 300 మందికి పైగా నిర్వహించి ఉచితంగా మందులను పంపిణిచేశారు.ఈ కార్యక్రమంలో వైద్యులు కిషోర్ కుమార్,ముషం సురేష్,ఉడుగుల సురేష్,ముశం ప్రణీత,ఉడుగుల అనిత,ఆస్పత్రి మేనేజర్ కిరణ్,సిబ్బంది,గ్రామశాఖ మల్లేష్,మండల అధ్యక్షులు ఇంగీలే రామారావు, అరుకాల వేరేశలింగం,గూడిపు సారంగపాణి,సుంకరి రమేష్,వంగ రామకృష్ణ,సతీష్ రెడ్డి,శ్రీనివాస్, సజ్జు, సలీమ్,నాగరాజు,ఎన్ ఎస్ యు ఐ నాయకులు అన్వేష్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు