భార్యను చూడటానికి బస్సును ఎత్తుకెళ్ళిన భర్త

By dhanadhannews.com

నందికొట్కూరు/ధనాధన్ న్యూస్: భార్యను చూడటానికి ఏకంగా ఏపిఎస్ ఆర్టీసి బస్సునే ఎత్తుకెళ్లాడు ఓ భర్త.బస్ దొంగతనం విషయం తెలుసుకున్న పోలీసులు బస్సును ఆపి అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా నా భార్య ఇదే గ్రామంలో ఉంటుందని,నా భార్యను చూసేందుకు వాహనాలేవి లేకపోవడంతో చూస్తున్న క్రమంలో బస్టాండ్ లో బస్సు ఉందని,తాళాలు బస్సుకే ఉండటంతో బస్సును తెచ్చుకున్నానని పోలీసులకు సమాధానం ఇచ్చాడు.ఈ సంఘటన పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామంలో చోటుచేసుకుంది..