దళితబందు రెండవ విడత మంజూరు చేయాలనీ ఇల్లంతకుంట, జమ్మికుంట, వీణవంక మండల పరిషత్ అభివృద్ధి అధికారులకు దళితబంద్ లబ్ధిదారులు వినతిపత్రం అందించడం జరిగింది.
2021 సంవత్సరంలో బీ అర్ ఎస్ ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టు గా ప్రవేశపెట్టిన దళితబందు హుజురాబాద్ నియోజకవర్గం లోని ప్రతి కుంటుంబానికి 10లక్షల చొప్పున వారి వారి ఖాతాలలో జమచేయడం జరిగింది.మొదటి విడతగా 5లక్షలు రెండవ విడిడతగా 5లక్షలు ఇస్తామని కలెక్టర్ చెప్పడం జరిగింది.కానీ అనుకోకుండా ఎన్నికల నియామావలి రావడంతో దళితబందు ని తాత్కాలికంగా నిలిపివేశారు.ఎలక్షన్స్ అయిపోయాక వస్తాయని ఎదురుచూసిన దళితులకు ఒక్కసారిగా షాక్ తగిలింది.ప్రభుత్వం మారడంతో అందరి ఖాతాలను హోల్డ్ లో పెట్టడంతో అయోమయానికి గురవుతున్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడత తీసుకున్న ప్రతి ఒక్కరికి రెండవ విడత మంజూరు చేసేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు.పార్లమెంట్ ఎన్నికల నియమావలి వచ్చే లోపే రెండవ విడత పూర్తిస్థాయిలో ఇవ్వాలని లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 20వేయిల దళిత కుటుంబాలు ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కోలుగూరి నరేష్,రామంచ రాకేష్
కలకోట సారయ్య,పార్లపల్లి రవీందర్,ఆకినపల్లి రీటా,
పార్లపల్లి శంకర్,ప్రమోద్,ఆకినపల్లి చంటి,సప్పిడి సతీష్,గాజుల శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.
