నిరుద్యోగుల యువతి యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలి

By dhanadhannews.com

  • బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్

జమ్మికుంట/ధనాధన్ న్యూస్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంట్రల్ ఫంక్షన్ హాల్లో తేదీ జూలై  21 2025 సోమవారం రోజున  హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా  జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని బిఆర్ఎస్వి టౌన్ ప్రెసిడెంట్ కొమ్ము నరేష్ ఓ ప్రకటనలో తెలిపారు. హుజురాబాద్ నియోజవర్గం లో ఉన్నటువంటి నిరుద్యోగులు టెన్త్, ఇంటర్మీడియట్,డిగ్రీ,పీజీ,బీటెక్, చదువుకున్న ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం  చేసుకోవాలని కోరుకోవడం జరుగుతుంది వారు తెలిపారు. అదేరోజు రిక్రూట్మెంట్ కూడా చేయడం జరుగుతుందని, 70 కంపెనీలు 3000 ఉద్యోగాలు తీసుకురావడం జరుగుతుందని, హుజురాబాద్ లో ఉన్నటువంటి యువతి యువకులు నిరుద్యోగులై ఉన్న చదువుకున్న వారి కోసం హుజురాబాద్ ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేసుకోవాలని అందుకోసం ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని, కాబట్టి నిరుద్యోగులు వినియోగించుకోవాలని వారు యువతి యువకులను ఈ సందర్భంగా కోరారు. నిరుద్యోగుల తరఫున బిఆర్ఎస్వి తరపున ఎమ్మెల్యే పాడి కౌశిక్  రెడ్డి కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోవడం జరుగుతుంది ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుందని నరేష్ అన్నారు.