పలు గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే సతీమణి

By dhanadhannews.com

రామగుండం/ధనాధన్ న్యూస్:పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎలుకలపల్లి గుంటూరుపల్లి గ్రామాల్లో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సతీమణి మనాలి ఠాకూర్ పర్యటించారు.పల్లెల్లోని ప్రజలతో మమేకమై ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఎలాంటి సమస్యలు ఉన్న ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరించే దిశగా కృషి చేస్తానని అన్నారు.ఇల్లు లేని నిరుపేదలకు ఇండ్లు,ఫ్రీ కరెంట్,ఐదు పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని అన్నారు.మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ ఇచ్చి,సర్టిఫికెట్లు అందజేసి ఉపాధి కల్పిస్తామని ఈ అవకాశాన్ని మహిళలు అందరూ వినియోగించుకోవాలని కోరారు.రామగుండం ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మనాలి ఠాకూర్,పాలకుర్తి మండల అధ్యక్షుడు ముక్కెర శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, గ్రామ అధ్యక్షుడు గుండు లక్ష్మణ్,కార్యకర్తలు,మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.