మహాముత్తారం(ధనాధన్ న్యూస్)మే22:మహాముత్తారం మండలంలోని పెగడపల్లి గ్రామంలో జాతీయ ఉపాధిహామీ కూలీలకి జాతీయ యోగ శిక్షణ అధ్యాపకుడు వావిల్ల కిష్టయ్య శిక్షణ ఇస్తూ యోగ వలన జరిగే ప్రయోజనాలను కూలీలకి వివరించడం జరిగింది.ప్రతిరోజూ ఐదు నిమిషాలు ధ్యానం చేయడం వలన మనిషిని పట్టిపిడిస్తున్న సైకో సోమటిక్ వ్యాధులు మానసిక వ్యాధులు భయం, కోపం,భద్రత భావము మొదలైన వ్యాధులను నయం చేయవచ్చునని,కరోన,గుండె సంబంధిత వ్యాధులు ధ్యానం తో నయం చేయవచ్చునని ఉపాధి హామీ కూలీలకి పని సామర్ధ్యమును పెంచడంతో పాటు పనిలోని ఒత్తిడిని తగ్గించునకు యోగ ఉపయోగ పడుతుందని తెలుపడం జరిగింది.యోగ కేవలం పట్టణాలకే పరిమితం మౌతున్నది గ్రామీణప్రజలు కూడా ప్రకృతి సిద్దమైన యోగను నోర్చుకొని తన జీవనంలో ఒక భాగంగా చేసుకొని సంపూర్ణ మైన శారీరక,మనసిక ఆరోగ్యమును పొందాలని యోగ మాస్టర్ కిష్టయ్య తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు ఫీల్డ్ అసిస్టెంట్ సారంగా పాణి,యోగ మాస్టర్ కిష్టయ్య,వావిల్ల రవి,గ్రామ పెద్దలు,తదితరులు పాల్గొన్నారు.
