కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా మత్స్య సహకారాల సంఘం అధ్యక్షులు పిట్టల రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న శుభ సందర్భంగా సైదాపూర్ మండల కేంద్రం నుండి 26 గ్రామాల ముదిరాజ్ సంఘ నాయకులు వివిధ గ్రామాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులు జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిశెట్టి చంద్రయ్య మాట్లాడుతూ,జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు రాయిచెట్టి చంద్రయ్య మత్స్య సహకారాల సంఘం డైరెక్టర్ నెల్లి రాములు,మత్స్య సహకారాల సంఘాల అధ్యక్షులు మారుపాక రాజు ఆధ్వర్యంలో 200 మందితో కరీంనగర్ కు తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు ముదిరాజ్ కార్పొరేషన్ మంజూరు చేయడం ఎంతగానో సంతోషంగా ఉంది అని కాంగ్రెస్ పార్టీ కి మద్దతుగా జిల్లా మత్స్య సహకార సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల రవీందర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషంగా ఉందని కాంగ్రెస్ పార్టీ రానున్న రోజుల్లో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు మా ముదిరాజ్ కుల బాంధవులకు అభివృద్ధి దిశగా నడుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో సైదాపూర్ సంఘం అధ్యక్షులు నెల్లి రాములు,వెనికే పెళ్లి సంఘం అధ్యక్షులు లంక సిరి రాజు, గణపురం సంఘం అధ్యక్షులు భాష వేణి రాజయ్య, రాయికల్ సంఘం అధ్యక్షులు కులకాని మైసయ్య, బొమ్మకల్ సంఘం అధ్యక్షులు ఏలబోయిన వెంకటయ్య, రామచంద్రపురం సంఘం అధ్యక్షులు గూళ్ల వెంకట్రాజ్యం,ఎలభూతారం సంఘం అధ్యక్షులు గంగాధర కనకయ్య ,హెగ్లాస్పూర్ సంఘం అధ్యక్షులు తాడవేణి కనకయ్య సోమవారం సంఘం అధ్యక్షులు పిట్టల కిరణ్ మరియు ఉపాధ్యక్షులు సంఘ సభ్యులు అందరూ అధిక సంఖ్యలో హాజరయ్యారు.
