సైదాపూర్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్ 14:సైదాపూర్ మండల కేంద్రంలోని డా.బీఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా గతంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్ట కోసం కేటాయించిన స్థలంలో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి స్వీట్లు, పండ్లు పంపిణీ చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.అనంతరం అంబేద్కర్ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. డా.భీంరావ్ రాంజీ అంబేడ్కర్,ఒక సంఘసంస్కర్త అని,అంటరానితనం,కుల నిర్మూలన కోసం ఆయన ఎంతో కృషి చేశారని అన్నారు.డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతని,అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో భారత రాజ్యాంగాన్ని రచించి మన దేశానికి దిశానిర్దేశం చేసిన మహానీయుడని కొనియాడారు.అంబేద్కర్ ఆశయాల సాధన దిశగా యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా,స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో బోనగిరి అనిల్ మాజీ 5వ వార్డు మెంబర్ సైదాపూర్ ,గొల్లపల్లి కనకయ్య,కోడం సురేష్,ఖమ్మం రమేష్,ఎర్రల శ్రీనివాస్,వేముల సురేష్,వేముల కిషోర్,బండారి భరత్,గాదపాక అశోక్,గున్నల కృష్ణమూర్తి,భూపెల్లి జనార్ధన్,రాగుల వెంకటి,దొంత రామస్వామి,వేముల సాయికుమార్,బండారి శరత్,జవాజ్జి అభిషేక్, పొడిశేట్టి అరుణ్,గడ్డం శేఖర్,వంగ రజనీకాంత్,అందె శ్రీనివాసరావు పాల్గొన్నారు.
