- ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలింపు
ఇల్లందకుంట(ధనాధన్ న్యూస్)ఏప్రిల్24:హుజరాబాద్ నియోజకవర్గంలో బుధవారం వివిధ వివాహ కార్యక్రమాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రమాదంలో గాయపడ్డ యువకుడ్ని గుర్తించి దగ్గరుండి ఆసుపత్రికి పంపించి మానవత్వం చాటుకున్నారు.వివరాలు ఇలా ఉన్నాయి.నియోజకవర్గంలోని పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఓ వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు మర్రిపల్లిగూడెం నుంచి కన్నూరుకి వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్ ఢీకొని మధు అనే యువకుడు తీవ్రంగా గాయపడటాన్ని గమనించిన ఎమ్మెల్యే తన కాన్వాయ్ ని వెంటనే ఆపారు. హుటాహుటిన సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాదంలో గాయపడ్డ మధుని తానే స్వయంగా పట్టుకొని మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ఫోన్ చేసి చికిత్స అందించాల్సిందిగా డాక్టర్ని విజ్ఞప్తి చేశారు.అనంతరం బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి మెరుగైన వైద్యం అందించడానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు.ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మానవతా దృక్పథానికి నియోజకవర్గంలోని ప్రజలంతా అభినందనలు తెలిపారు.
