రేపే సీఎం రేవంత్ రెడ్డి ప్రచార సభ

By dhanadhannews.com

  • సీఎం అయిన తరువాత మొదటిసారి హుజురాబాద్ కి రాక
  • సీఎం హామీ కోసం ఎదురుచూస్తున్న దళితబందు లబ్ధిదారులు
  • రెండవ విడత విడుదల కోసం సీఎంని వేడుకునే అవకాశం

న్యూస్ డెస్క్(ధనాధన్ న్యూస్)ఏప్రిల్29:తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఎన్నికైన తర్వాత మొదటిసారి హుజురాబాద్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి రేపు రానున్నారు.పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా జమ్మికుంట పట్టణంలో దాదాపు లక్ష మంది జనాభా తో ఏర్పాటు చేస్తున్న సభలో పాల్గొననున్నారు.తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా ఉన్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయలేదు.కరీంనగర్ పార్లమెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురావేయడమే లక్ష్యం గా రేపటి సభ లో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండబోతుందని కాంగ్రెస్ శ్రేణుల అభిప్రాయం.రేపటి సభలో హుజురాబాద్ నియోజకవర్గంలోని దళిత బంద్ రెండవ విడత కోసం ఎదురుచూస్తూన్న లబ్ధిదారులకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీ ఇస్తారేమో అనే ఆశతో లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.రేపటి సభలో సీఎం రేవంత్ రెడ్డికి వారి సమస్యలు తెలిపే అవకాశం కల్పించాలని నియోజకవర్గ ముఖ్య నాయకులను కొందరు లబ్ధిదారులు కలిసినట్లు వినికిడి.హుజురాబాద్ నియోజకవర్గంలో కీలకంగా ఉన్న దళితుల ఓట్లు హస్తం “హస్తగతం” కావాలంటే రేపటి సభలో సీఎం దళిత బంద్ పై స్పష్టమైన హామీ ఇస్తే దళితుల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థి గెలుపులో కీలకం కానున్నాయి.చూడాలి మరి రేపటి సభతో నైనా సీఎం రేవంత్ రెడ్డి దళిత జీవితాల్లో వెలుగునింపే మాట చెప్పి దళితుల ముఖాల్లో ఆనందం చూసే ప్రయత్నం చేస్తారో లేదో వెయిట్ చేద్దాం.