తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతం ఆవిష్కరించిన వొడితల ప్రణవ్

By dhanadhannews.com

జమ్మికుంట(ధనాధన్ న్యూస్)మే7: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ సింగపూర్ లోని తన నివాసంలో సోమవారం రాత్రి తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతం సంఘమిత్ర యూట్యూబ్ ఛానల్ లో ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా వొడితల ప్రణవ్ మాట్లాడుతూ తల్లడిల్లిన భరతమాత సామాజిక గీతాన్ని ఇల్లందకుంట మండలం సీతంపేట కి చెందిన రచయిత మైస ఎల్లయ్య భారతదేశంలో ప్రస్తుత తరుణంలో స్త్రీలకు జరుగుతున్న అన్యాయాన్ని, మాణిపూర్ రాష్ట్రంలో రెండు తెగలకు మధ్య జరిగిన పోరాటంలో స్త్రీల పై జరిగిన అమానుషా సంఘటనలను కండ్లకు కట్టినట్టుగా పాట రచన ఉందని  మైస ఎల్లయ్య ని అభినందించారు.. సింగర్ సౌజన్య పాటని తన స్వరం తో లీనమై అద్భుతంగా పాడిందని,మ్యూజిక్ డైరెక్టర్ కిట్టు కూడా పాటకు తగ్గట్టుగా మ్యూజిక్ అందించారని,ఈ సాంగ్ చిత్రీకరణ కు ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన జీడీ సదానందం ని,సంఘమిత్ర టీవీ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ పాటను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఛానల్ సిఈఓ కొండ విజయ్ ని అభినందిస్తూ భవిష్యత్ లో మరిన్ని సమాజాన్ని మేలుకొల్పే మరిన్ని పాటలు రచించి అందించాలని రచయిత మైస ఎల్లయ్య ని టీం సభ్యులను అభినందించారు..ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి తిప్పారపు సంపత్, రచయిత మైస ఎల్లయ్య, ప్రొడ్యూసర్ జీడీ సదానందం, కాంగ్రెస్ నాయకులు చల్లురి రాహుల్ ఇతర టీం సభ్యులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..