- మాజీ సర్పంచ్ అక్రమాల పై విచారణ జరిపించండి
సైదాపూర్(ధనాధన్ న్యూస్)మే25:సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామ శివారులోని ప్రభుత్వ భూమిని మాజీ సర్పంచ్ తన కుటుంబ సభ్యుల పేరున అక్రమ పట్టా చేసి ఆక్రమించుకున్నాడని గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్ కి పిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే గ్రామ శివారు లోని మసీదు దగ్గర భూమిని పూర్వం అంబేద్కర్ భవనం,ప్రాథమిక పశువుల వైద్యశాలకు కేటాయించిన భూమిని ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ సర్పంచ్ పదవిలో కొనసాగుతూ తన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సర్వేనెంబర్ 399/ఆ లో సుమారు 14 గుంటల భూమిని మాజీ సర్పంచ్,ప్రస్తుత ఎంపీటీసీ ఇందిరా సుధీర్ కుమార్ గౌడ్ తల్లి ఏరుకొండ సుశీల పేరున తప్పుడు పట్టా చేయించాడని ఆ భూమిని ప్రస్తుతం ప్లాట్లగా పెట్టి విక్రయించడానికి సిద్ధమవుతున్నాడని,ఈ విషయం గురించి ప్రస్తుత మాజీ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలందరూ పలుమార్లు తహాశీల్దార్,సైదాపూర్, ప్రజావాణి ద్వారా కలెక్టర్ దరఖాస్తులు సమర్పించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి భూమిని గ్రామపంచాయతీకి అప్పజెప్పాలని,అలాగే బొమ్మకల్ శివారులో చెరువు నుంచి వచ్చే పెద్దతూముకు సంబంధించిన కాలువను సుమారుగా 20 గుంటలను పూడ్చివేసి నిరుపేద దళితుల భూములకు నీళ్లు రాకుండా అడ్డుకోవడం వలన గత పది సంవత్సరాల నుంచి ఆ వర్గాలు నష్టపోయాయని ఇప్పటికైనా పెద్దతూముకు సంబంధించిన కాలువను మరలా తవ్వించి వారికీ న్యాయం చేయాలని లేఖ లో కోరారు.అలాగే బొమ్మకల్ గ్రామపంచాయతీ దగ్గర గల గ్రామకంఠంకు సంబంధించిన దొరగారికి (దొర శుభకర్రావు)సంబంధించిన భూమిని పురాతన కాలం నుంచి గ్రామపంచాయతీకి ప్రతియేటా దసరా రోజు నిర్వహించే(మైసమ్మ తల్లికి చేసే) స్థలమును అక్రమంగా ఆక్రమించి ఆ భూమిని తానే కొనుగోలు చేసినట్టు చెబుతున్నాడని గత పది సంవత్సరాల నుంచి తన రాజకీయ అండ,పలుకుబడితో గ్రామంలో ఉన్న భూములు, చెరువులను తన ఇష్టారీతిన అతని కుటుంబ సభ్యుల పేరున పట్టా చేయించుకుంటూ గ్రామస్థులకు అన్యాయం చేస్తున్నారని ఈ విషయాలపై చొరవ తీసుకొని జిల్లా స్థాయి అధికారులతో తగు విచారణ జరిపి గ్రామపంచాయతీకి ఆ భూమిని తిరిగి అప్పగించేలా చర్యలు తీసుకొని,భూమిని ఆక్రమించుకున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన చిట్టి ప్రకాష్ రెడ్డి మాజీ సర్పంచ్ బొమ్మకల్,ఉప సర్పంచ్ ఓదేలు,వేముల శ్రీకాంత్,వేముల నారాయణ,రుద్రారపు రమేష్,రుద్రారపు రవి,దాసరి సత్తయ్య,తీగల పద్మనాభం, ఓజ్జ కొమరయ్య,ఏరుకొండ శ్రీనివాస్ ఏలూరి సంజీవరెడ్డి, పలువురు కలిసి కలెక్టర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలియజేశారు.
