- జాతరకు ఆలయాన్ని అద్భుతంగా అలంకరించిన రజకులు
సైదాపూర్(ధనాధన్ న్యూస్)జూన్13: రజకుల కుల ఆరాధ్య దైవమైన శ్రీమడేలయ్య స్వామి జాతరను కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో గురువారం రజకులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రతి గడప నుండి మహిళలు బోనం ఎత్తుకొని డప్పుచప్పుళ్లు శివసత్తుల పూనకాల మధ్య పురవీధుల గుండా గ్రామ శివారులోని ఆలయానికి చేరుకొని మడేలయ్య స్వామికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని,వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని స్వామివారిని వేడుకున్నారు.మడలేయ్య స్వామి జాతరకు ఆలయాన్ని విద్యుత్ బల్బులతో,రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా త్రాగునీరు,చలువ పందిళ్ళు ఏర్పాటు చేశారు.భవిష్యత్తులో రజక సంఘం సభ్యులమంతా మరింత ఐక్యతతో ఉండి మడలేయ్య స్వామి జాతరను పెద్ద ఎత్తున నిర్వహిస్తామని చెప్పారు.ఈ కార్యక్రమంలో సోమారపు రాజయ్య,రాజు,సంపత్ కుమార్,స్వామి,రాజయ్య,సదయ్య తదితరులు పాల్గొన్నారు.
