- ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం
- ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్
కరీంనగర్/ధనాధన్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ అన్నారు.సోమవారం నాడు ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్ కి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 7 వేల పై చిలుకు కోట్ల రూపాయల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,విద్యార్ధులు చదివిన కళాశాలలో తమ కోర్సు పూర్తి చేసిన కూడా వారి సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు ఇవ్వడం లేదని, దీనిద్వారా ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి ఇబ్బందికరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్,ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ మామిడిపల్లి హేమంత్ ఏఐఎస్ఎఫ్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
